Ttd key alerts devotees: ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోతగా వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది.
గత వారం రోజులుగా ఎక్కడికక్కడ వానలకు బ్రేక్ లు పడ్డాయి. అంతేకాకుండా జనాలంతా ఉక్కపొతతో విలవిల్లాడిపోయారు. అసలు ఇది వానకాలమా..లేదా ఎండకాలమా అని జనాలు టెన్షన్ పడిపోయారు. కొన్ని చోట్ల ఏకంగా 41 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మరల వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కుండపోతగా వానలు కురుస్తున్నాయి. మళ్లీ రోడ్లన్ని జలమయం అయిపోయాయి. జనజీవనం మరోసారి అస్తవ్యస్తంగా మారిపోయింది. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏపీలోని తిరుపతి జిల్లా తిరుమలలో కూడా కుండపోతగా వాన కురుస్తుంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి కురుస్తున్న వర్షాలతో భక్తులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉదయం నుంచి వాతావరణం చల్లగా మారింది. మధ్యాహ్నం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడుతుంది. తిరుమాడ విధుల్లో ఇప్పటికీ నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లో రామ్ బాగీచా గెస్ట్ హౌస్ ముందర మోకాళ్ళ లోతు వరకు నీళ్ళు చేరింది. షాపింగ్ కాంప్లెక్స్ అఖిలండం దగర ఏర్పాటుచేసిన షెడ్ లలో భక్తులు చేరుకుంటున్నారు.
క్యూ లైన్ లో ఉన్న భక్తులకు నారాయణగిరి షెడ్ లోకి పంపిస్తున్నారు. వర్షం కారణం గా ఘాట్ రోడ్డు లో కొండ చరియలు విరిగి పడే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ అధికారులు భక్తులకు సూచించారు. తిరుమల లో గెస్ట్ హౌస్ ల దగర వృక్షాలు నెలకి వొరిగి కొమ్మలు విరిగిపాడుతున్నాయి. ఎడతెరిపిలేకుండా పడే వర్షం కి వసతి దొరకని భక్తులు అవస్థలు పడుతున్నారు.
ఈ క్రమంలో తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తగు జాగ్రత్తలుతీసుకొవాలని టీటీడీ సూచనలు చేసింది. చిన్న పిల్లలు, పెద్దవారు, హెల్త్ సమస్యలుఉన్న వారు ముందు జాగ్రత్తలు తీసుకొవాలని టీటీడీ కోరింది.
మరోవైపు గత వారం రోజులుగా వానాలు ఆగిపోవడంతో తిరుమలకు భక్తులు భారీగా పొటెత్తారు. అయితే.. ప్రస్తుతం అన్ని కంపార్ట్ మెంట్ లు కూడా ఫుల్ గా ఉన్నాయి. మరోవైపు టీటీడీ సైతం భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుటుంది. ఈ నేపథ్యంలో సడెన్ గా కురుస్తున్న వర్షాలతో మాత్రం భక్తులు ఒకింత అసౌకర్యానికి లోనౌతున్నారు.