Akshay Kumar Shares Shocking News: సైబర్ నేరాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. చిన్న అవకాశం వచ్చినా నేరస్థులు ఎవరినైనా లక్ష్యంగా చేసుకుంటారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరికైనా ఈ ముప్పు తప్పడం లేదు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్.. తన కూతురికి సైబర్ నేరగాళ్ల వల్ల జరిగిన భయంకరమైన ఓ ఇన్సిడెంట్‌ను పంచుకున్నారు.
1/5ఈ రోజుల్లో ఆన్‌లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరస్థులు ఏ చిన్న అవకాశం వచ్చినా.. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకూ.. ప్రతి ఒక్కరిని అల్లాడిస్తున్నారు. తాజాగా ముంబైలో డీజీపీ కార్యాలయంలో అక్టోబర్ 2025 సైబర్ అవేర్‌నెస్ మంత్ ప్రారంభం సందర్భంగా.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పాల్గొన్నారు. అక్కడ తన కుటుంబానికి సైబర్ నేరస్థులు చేసిన భయంకర అనుభవాన్ని పంచుకున్నారు.
2/5అక్షయ్ కుమార్ కూతురు 13 ఏళ్ల నితారా.. ఆన్‌లైన్ గేమ్ ఆడుతుండగా ఒక అపరిచితుడు ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాడు. మొదట ఆ వ్యక్తి మంచి మాటలు చెప్పి స్నేహం చేయాలని ప్రయత్నించాడు. కొంతసేపటికి అమ్మాయివా, అబ్బాయినా అని అడిగాడు. నితారా అమ్మాయినని చెప్పగానే అతని మాటలు మారిపోయి చెడ్డగా మారాయి. వెంటనే తన న్యూడ్ ఫొటోలు పంపమని అడిగాడు.
3/5అతను అలా అడగ్గానే తన కూతురు నితారా భయపడి గేమ్ ఆపేసి.. తల్లి ట్వింకిల్ ఖన్నాకు చెప్పిందని.. ఇది చాలా మంచి నిర్ణయమని అక్షయ్ కుమార్ అన్నారు. పేరెంట్స్‌కి ఏం జరిగిన పిల్లలు వెంటనే చెప్పాలని.. లేదంటే కఠిన పరిస్థితులు ఎదురవుతాయని అన్నారు.
4/5ఈ ఘటన తన కుటుంబానికి మాత్రమే కాదు దేశంలోని ప్రతి పిల్లలకు, తల్లిదండ్రులకు హెచ్చరిక అని అక్షయ్ కుమార్ చెప్పారు. నేరస్థులు మొదట మంచిమాటలతో నమ్మకం పెంచుకుని తర్వాత పిల్లలను లైంగికంగా వేధించాలని ప్రయత్నిస్తారు. ఇది బ్లాక్‌మెయిల్ వరకు వెళ్లి.. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలకు కూడా దారితీస్తుందన్నారు.