Add Zee Business As A Preferred Source
App

Tollywood Hero: మ‌రోసారి తండ్రైన టాలీవుడ్ హీరో.. ఎవరో తెలుసా..?

Written ByAruna Maharaju
Published: Sep 27, 2025, 04:49 PM IST|Updated: Sep 27, 2025, 04:49 PM IST

Hero Suhas: సుహాస్.. ఈ పేరు గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. కమెడియన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుహాస్.. కలర్‌ ఫొటో సినిమాతో హీరోగా మారిపోయాడు. సినిమాల్లోకి రాక ముందు పలు షార్ట్ ఫిలిమ్స్‌లో నటించి మెప్పించాడు సుహాస్. తాజాగా తాను మరోసారి తండ్రి అయ్యానంటూ సుహాస్ అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పాడు.
 

Hero Suhas1/5

టాలీవుడ్ హీరో సుహాస్

టాలీవుడ్ హీరో సుహాస్ మ‌రోసారి తండ్రి అయ్యాడు. ఆయ‌న భార్య ల‌లిత పండంటి మగబిడ్డకు జ‌న్మనిచ్చింది. ఈ విష‌యాన్ని సుహాస్ తన సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానులకు తెలియ‌జేశాడు. 

Tollywood Hero Suhas2/5

త‌న భార్య‌, కొడుకుతో ఉన్న ఫోటోను షేర్ చేసిన సుహాస్‌.. ఇట్స్ ఏ బాయ్ అగేన్ అనే క్యాప్షన్ పెట్టాడు. దీంతో సుహాస్ దంపతులకు సినీ సెలబ్రిటీలు, ఫ్యాన్స్, నెటిజన్లు కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.  

Hero Suhas3/5

హీరో సుహాస్

వీరికి తొలి సంతానంగా కూడా కొడుకే జ‌న్మించిన సంగ‌తి తెలిసిందే.  సుహాస్ భార్య పేరు లలిత. వీరిది లవ్ మ్యారేజ్. దాదాపు ఏడేళ్లు పాటు ప్రేమించుకున్న వీరు.. 2017లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన ఏడేళ్ల‌కు 2024లో వీళ్ల‌కి తొలి సంతానంగా బాబు జ‌న్మించాడు.    

Tollywood Hero Suhas4/5

మ‌రోసారి తండ్రైన సుహాస్

షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సుహాస్ కలర్ ఫోటో చిత్రంతో హీరోగా మారాడు. రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ వంటి చిత్రాల‌లో తన నటనతో ఆక‌ట్టుకున్నాడు.  

Tollywood Hero Suhas5/5

మ‌రోసారి తండ్రైన సుహాస్

ప్ర‌స్తుతం సుహాస్ కోలీవుడ్‌లో మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ‘మండాడి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో తొలిసారి ఆయ‌న విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఇటీవ‌ల సుహాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా విడుద‌లైన ఈ చిత్రంలోని లుక్ ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే.