Add Zee Business As A Preferred Source
App

Sadaa Deep Sad: పుట్టెడు దుఃఖంలో హీరోయిన్‌ సదా.. ఏం జరిగిందో తెలుసా?

Published: Sep 19, 2025, 07:27 PM IST|Updated: Sep 19, 2025, 07:29 PM IST

Actress Sadaa Deepest Condolence Since One Week: తన అమాయకత్వం.. తన నటనతో తెలుగు సినీ ప్రేక్షకులకు ఆకట్టుకున్న హీరోయిన్‌ సదా తీవ్ర విషాదంలో మునిగారు. వారం రోజులుగా కోలుకోలేని విషాదంలో ఆమె ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా సదా సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం.

1/6

'జయం'తో 2002లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఒక దశాబ్దం వరకు తెలుగు ప్రేక్షకులకు వినోదం అందించారు. అనంతరం కొన్నేళ్లు దూరమైన సదా ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తున్నారు. అయితే ఆమె తాజాగా తీవ్ర విషాదంలో మునిగారు. కన్నీటి పర్యంతమవుతూ సోషల్‌ మీడియాలో ఓ పోస్టు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

2/6

'నాన్నను కోల్పోయి వారం రోజులైంది. కానీ ఓ యుగంలా కనిపిస్తోంది. గడిచిన ప్రతి క్షణం గతంలో కంటే భారంగా అనిపిస్తుంది. ఆయన వదిలిపెట్టిన నిశ్శబ్దం, ఆయన లేని లోటుతో కలిగే బాధతో కుంగిపోతున్నా' అని సదా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

3/6

ఈ సందర్భంగా తన తండ్రితో కలిసి దిగిన ఫొటోలు సదా పంచుకున్నారు. తండ్రితో తనకు ఉన్న అనుబంధాన్ని వివరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. తన సినీ ప్రయాణంలో తన తండ్రి ప్రోత్సాహం ఎంతో ఉందని గుర్తుచేసుకున్నారు.

4/6

ఆయన కూతురు కావడం గర్వకారణంగా ఉందని సదా పేర్కొన్నారు. తన చుట్టూ ఉన్నవారికి ప్రేమ, ఆప్యాయత పంచిన నాన్నను చూసి గర్వపడుతున్నట్లు ప్రకటించారు. తన తండ్రి వెలకట్టలేని మనిషి అని.. నాన్న మిస్‌ యూ అని సదా పోస్టు చేశారు.

5/6

తన తండ్రి మరణ వార్తను పంచుకున్న సదాకు నెటిజన్లు, ఆమె అభిమానులు ఆమెకు అండగా నిలుస్తున్నారు. సదా తండ్రి మృతికి సంతాపం వ్యక్తం చేస్తూనే ధైర్యం చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ధృడంగా ఉండాలని కామెంట్‌ చేస్తున్నారు.

6/6

మహారాష్ట్రకు చెందిన సదా కుటుంబం ప్రత్యేకం. ఆమె తల్లిదండ్రులు పరస్పరం వేరే వర్గం. తండ్రి డాక్టర్‌గా పని చేస్తుండేవారు. తల్లి ప్రభుత్వ ఉద్యోగి. టీనేజ్‌లోనే సినీ పరిశ్రమలోకి ప్రవేశించి అనేక విజయవంతమైన సినిమాలు సదా చేశారు. తర్వాత కొన్నాళ్లకు ఇండస్ట్రీ నుంచి కనుమరుగయ్యారు. ఇప్పుడు తండ్రిని కోల్పోవడంతో తీవ్ర విషాదంలో మునిగిన ఆమెకు నెటిజన్లు అండగా నిలుస్తున్నారు.