Highly Educated Actresses: అత్యంత ఉత్తమమైన చదువులు చదువుకున్న తెలుగు హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

Highly Educated Telugu Heroines 

భారతీయ సినీ పరిశ్రమలో టాలెంట్‌ ఉన్న నటీమణులు మాత్రమే కాదు, మంచి విద్యాబ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న వాళ్లూ ఉన్నారు. టాలీవుడ్‌లో ఉన్న కొన్ని ప్రముఖ నటి విద్యలో ఉన్న రికార్డ్స్‌ గురించి తెలుసుకుందాం.  

1 /6

రష్మిక మందన్న బ్యాచిలర్స్‌ డిగ్రీను మానసిక శాస్త్రం, జర్నలిజం, ఇంగ్లీష్‌ లిటరేచర్‌లో బెంగుళూరులోని ఒక ప్రముఖ కాలేజీలో పూర్తిచేశారు.  

2 /6

సమంతా తన గ్రాడ్యుయేషన్‌ స్టెల్లా మారిస్‌ కాలేజీ, చెన్నైలో కమర్స్‌ డిగ్రీతో పూర్తిచేశారు. తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టి టాప్‌ హీరోయిన్‌గా ఎదిగారు. 

3 /6

తాజాగా టాలీవుడ్‌లో పేరు తెచ్చుకున్న శ్రీలీల మెడిసిన్‌ చదివారు. ముంబయిలోని ఒక ప్రముఖ మెడికల్‌ కాలేజీలో MBBS పూర్తి చేశారు. అయినప్పటికీ, సినిమాల్లో నటనపై ఎక్కువ ఆసక్తి చూపారు.  

4 /6

లక్ష్మీ మంచు ఓక్లహోమా సిటీ యూనివర్సిటీ నుండి థియేటర్‌ ఆర్ట్స్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ పూర్తి చేశారు. ఆమె నటనపై ఉన్న అభిరుచితో టాలీవుడ్‌, టీవీ రంగాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. 

5 /6

సాయి పల్లవి కేవలం గొప్ప నటి మాత్రమే కాదు, ఆమె ఒక డాక్టర్‌ కూడా. జార్జియాలోని టిబిలిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ నుండి MBBS పట్టా పొందారు. అయినప్పటికీ, తన నటనపై ఆసక్తితో టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా ఎదిగారు.  

6 /6

రెజీనా కసాండ్రా మానసిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. ‘ఎవరు’ చిత్రంలో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది.