Holi Colours effect on hair and body: చాలా మంది హోలీ వేడుకను ఫుల్ జోషగా జరుపుకుంటారు. చాలా మంది నేచురల్ రంగులతో హోలీని సెలబ్రేట్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఇటీవల మార్కెట్ లో ఎక్కువగా రసాయనాలతో కూడిన రంగుల్నిఅమ్మకానికి పెడుతున్నారు.
హోలీని మన దేశంలో చాలా ఘనంగాజరుపుకుంటారు. ఈసారి మనం హోలీని మార్చి 14న జరుకుబోతున్నాం. హోలీకి ఇంకా సమయం ఉన్న కూడా.. ఇప్పటి నుంచి రంగుల అమ్మకాలు జోరందుకున్నాయి. అయితే.. మార్కెట్ లో ప్రస్తుతం అనేక కలర్స్ అమ్మకానికి వస్తున్నాయి. ఈక్రమంలో హోలీకి నేచురల్ రంగుల్ని ఉపయోగించాలని పెద్దలు చెబుతుంటారు.
అయితే.. హోలీ రోజు చాలా మంది ఒకరిపై మరోకరు చిన్నా పెద్ద తేడాలేకుండా.. రంగుల్ని చల్లుకుంటారు. మరికొందరు తమ ముఖాలకు రంగులు పూసుకుంటూ ఎంతో గ్రాండ్గా హోలీ వేడుకల్ని జరుపుకుంటారు. ఈ క్రమంలో హోలీ వేడుక్లలో కొన్ని టిప్స్ లను పాటిస్తే.. రంగుల ప్రభావం మన శరీరంపై కానీ.. చర్మంపై కానీ ఉండదని నిపుణులు చెబుతున్నారు.
హోలీ రోజున ఉదయం లేవగానే.. శరీరంకు కొబ్బరి నూనె పెట్టుకొవాలి. జుట్టుకు కూడా ఎక్కువగా ఆయిల్ ను పెట్టుకొవాలి. దీని వల్ల ముఖంపై రంగులు పెట్టుకుంటూ.. అది ఎక్కువ సేపు నిలవదు. కడుక్కొగానే తొందరగా పొతుంది. పండగకు ముందే చేతి వేళ్లకు గోర్లు లేకుండా చూసుకొవాలి. అదే విధంగా హోలీ రోజున ముఖానికి అస్సలు మేకప్ లు చేసుకొకూడదు.
హోలీ రోజున శరీరంకు బాడీ మాయిశ్చరైజేషన్ చేసుకున్న కూడా మంచి ఫలితం ఉంటుంది. చాలా మంది రంగుల్ని తమ శరీరంలో కూడా పూసుకుంటారు. ప్రైవేటు పార్టుల వరకు కూడా పూసుకుంటారు. ఇలా చేయకూడదు. దీనివల్ల రంగుల్ని అంతర్గంతంగా వెళ్తే అలర్జీలు సంభవిస్తాయి. కొన్నిసార్లు తీవ్రమైన సమస్యలకు కూడా దారితీయవచ్చు.
ముఖ్యంగాహోలీ తర్వాత వేడి నీళ్లతో స్నానంచేయాలి. శరీరంను ఎక్కువగా స్ర్కబ్ లతో గట్టిగా రుద్దకూడదు. ముందే శరీరంకు నూనె పెట్టుకుని ఉంటే.. మెల్లగా సబ్బులతో రుద్దిన కూడా రంగుల్ని ఈజీగా పొగొట్టుకొవచ్చు.మరోవైపు రంగుల్ని నోటిలోకి పోకుండా జాగ్రత్తలు తీసుకొవాలి. ఈ రంగుల నీళ్లను కూడా కడుపులో పొకుండా జాగ్రత్త తీసుకొవాలి. హోలీ రోజు రంగుల చేతులతో అన్నం తినకూడదు. ఈ టిప్స్ పాటిస్తే.. హోలీ రంగుల ప్రభావం నుంచి ఈజీగా బైటపడొచ్చు.