Add Zee Business As A Preferred Source
App

Tom Cruise: హలీవుడ్ ఐకాన్ టామ్ క్రూస్ ఆస్తులు ఎన్నో తెలుసా? అల్లు అర్జున్ కన్నా ఎక్కువే

Published: Oct 07, 2025, 08:06 AM IST|Updated: Oct 07, 2025, 08:06 AM IST

Tom Cruise Net Worth And Assets In Telugu: హలీవుడ్‌ స్టార్‌ నటుడు టామ్‌ క్రూజ్‌ ఎన్నో విజయవంతమైన సినిమాలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతున్నాడు. మరి అతడి ఆస్తిపాస్తులు ఎన్ని? మనోళ్ల కన్నా ఎక్కువనా అనేది చూద్దాం.

1/5

విభిన్న పాత్రలు.. సాహసాలు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న హాలీవుడ్ స్టార్ 'టామ్ క్రూజ్'. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందే వారిలో ఒకరిగా టామ్‌ క్రూజ్‌ ఉన్నాడు. ఇంతకీ అతడి ఆస్తులు ఎన్ని? ఎంత సంపాదించాడో తెలుసుకుందాం.

2/5

63 ఏళ్ల టామ్‌ క్రూజ్‌ నటనతో కట్టిపడేస్తూ.. కుర్రాడిలా సినిమాలు చేస్తున్నాడు. 'మిషన్: ఇంపాజిబుల్ - ది ఫైనల్ రికనింగ్' 2025లో విడుదలైన హాలీవుడ్ సినిమాల్లో మొదటి రోజే ఎక్కువ వసూళ్లు చేసిన సినిమాల్లో ఇది తొలిస్థానంలో నిలిచింది.

3/5

హలీవుడ్‌లో అత్యంత సంపన్న నటులలో ఒకరిగా టామ్ క్రూజ్ నిలుస్తున్నాడు. ఓ మ్యాగజైన్ ప్రకారం సుమారు రూ.53,414 కోట్ల ఆస్తులు ఉన్నాయని సమాచారం. క్రూజ్‌ సినిమాలతోనే భారీగా సంపాదిస్తున్నాడు. ఇక అవి కాకుండా వాణిజ్య ప్రకటనలతో కూడా టామ్‌ క్రూజ్‌ భారీగా ఆదాయం పొందుతున్నాడు.

4/5

వాణిజ్య ప్రకటనల ద్వారా కొన్ని కోట్ల ఆదాయం టామ్ క్రూజ్ సంపాదిస్తున్నాడు. టామ్‌ క్రూజ్‌కు సొంత సినిమా నిర్మాణ సంస్థ కూడా ఉంది. రికార్డింగ్ స్టూడియోలో 30 శాతం వాటాను కలిగి ఉన్నాడు. కొన్ని వెంచర్లలో కూడా పెట్టుబడి పెట్టాడు.

5/5

ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే టామ్ క్రూజ్ బెవర్లీ హిల్స్‌లో ఓ ఇంటిని 2007లో కొనుగోలు చేశాడు. 2015లో లండన్ సమీపంలోని 14 ఎకరాల ఎస్టేట్‌ ఉంది. హాలీవుడ్ కాంపౌండ్‌లోని ఓ భారీ నివాసం ఉంది.