Horoscope Today March 6: శ్రీక్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శశిర ఋతువు. ఫాల్గున మాసం శుక్ల పక్షం. 2025 మార్చి 6 గురువారం సూర్యోదయం ఉదయం 6.30 నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం 6. 20 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశుల్లో ఏ రాశి జాగ్రత్త ఉండాలి. ఏ రాశికి కలిసివస్తుంది తెలుసుకుందాం..
మేషరాశి.. ఈరోజు మేషరాశికి కొత్త పరిచయాలు పెరుగుతాయి. కొత్త ప్రాంతాలకు వెళ్తారు. అంతే కాదు పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. పని ప్రదేశంలో కూడా ఉత్సాహం పెరుగుతుంది. ఈరోజు హాయిగా సాగిపోతుంది.
వృషభరాశి.. వృషభరాశి వారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా భూమి వంటి స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. మిధున రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.
కర్కాటక రాశి.. ఇక కర్కాటక రాశి వారికి కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఎందుకంటే ప్రధానంగా ఇంటి పెద్దవారి సలహాలు తీసుకొని ముందుకు సాగుతారు. ఆరోగ్యం పై జాగ్రత్త తీసుకోవాలి. సీజనల్ జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.
తులా రాశి.. తులా రాశి వారికి మాత్రం ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. పెండింగ్‌లో ఉన్న పనులు అలాగే ఉంటాయి. సరైన సమయానికి ఏ పనులు పూర్తికాకుండా ఉంటాయి. రాబడి కూడా తగ్గుతుంది. వ్యాపారం మందగిస్తుంది.
కుంభ రాశి.. కుంభ రాశి వారు కూడా ఫలితం అంతంత మాత్రమే ఉంటుంది. సరైన మార్గంలో ఆలోచన చేయాలి. ఏదైనా పనికి కట్టుబడి ఉంటే.. సకాలంలో పూర్తి చేయకపోతే తిప్పలు తప్పవు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)