Add Zee Business As A Preferred Source
App

Aadhar card: ఆధార్‌కార్డుదారులకు బిగ్‌ అలెర్ట్‌.. ఆన్‌లైన్‌లో వివరాలు ఎన్నిసార్లు అప్‌డేట్‌ చేసుకోవచ్చు తెలుసా?

Written ByRenuka Godugu
Published: Sep 09, 2025, 12:19 PM IST|Updated: Sep 09, 2025, 12:19 PM IST

Aadhar card Update Limit: ఆధార్‌ కార్డు మనదేశంలో ఓ ప్రత్యేక గుర్తింపు కార్డు. ఏ డబ్బు లావాదేవీలు చేయాలన్నా ఆధార్‌ కార్డు ఉండాల్సిందే. అయితే, ఆధార్‌ కార్డు ఆన్‌లైన్‌లో కూడా అప్‌డేట్‌ చేసుకునే వెసులుబాటు యూడీఏఐ కల్పించింది. అయితే ఆధార్‌ కార్డు ఆన్‌లైన్‌లొ ఎన్నిసార్లు అప్‌డేట్‌ చేసుకోవచ్చు. 
 

Identity Card1/6

గుర్తింపు కార్డు

ఆధార్‌ కార్డు ఓ గుర్తింపు కార్డు. దీంతో స్కూలు, కాలేజీల అడ్మిషన్‌లు, బ్యాంకు లావాదేవీలు కూడా నిర్వహించుకోవచ్చు. ఏ బ్యాంకు ఖాతా ఓపెన్‌ చేయాలన్నా ఆధార్‌ కార్డు ఉండాల్సిందే.  

UIDAI2/6

యూఐడీఏఐ

అయితే ఆధార్‌ కార్డు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాల్సిందే. లేకపోతే ఇబ్బందులు తప్పవు. ఆధార్‌ కార్డును ఆన్‌లైన్‌లోనే సులభతరంగా అప్‌డేట్‌ చేసుకునే వెసులుబాటు యూఐడీఏఐ కల్పించింది.  

Aadhar Center3/6

ఆధార్‌ సెంటర్‌

దీంతో ఈజీగా ఇంట్లో నుంచి ఆన్‌లైన్‌లోనే ఆధార్‌ కార్డుపై ఇంటి నెంబర్‌, ఫోన్‌ నెంబర్‌ మార్చుకోవచ్చు. దీంతో పాటు ఆధార్‌ సెంటర్‌లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోచ్చు.  

Aadhar card update4/6

ఆధార్‌ కార్డు అప్‌డేట్‌

అయితే, మీరు ఒకవేళ ఆన్‌లైన్‌లో ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటే ఎన్నిసార్లు పరిమితి ఉంటుందా? మీ ఆధార్‌ కార్డుపై ఏవైనా వివరాలు తప్పలు ఉంటే దీంతో సమస్యలు తప్పవు. ఆధార్‌ కార్డుపై పేరు మార్చుకోవడానికి కేవలం రెండుసార్లు మాత్రమే అవకాశం ఉంటుంది.  

Birth Certificate5/6

పుట్టిన సర్టిఫికేట్‌

పేరు మార్చుకునే సమయంలో స్పెల్‌ చెక్‌ కూడా చేసుకోండి. అయితే, దీనికి పాన్‌ కార్డు, పాస్‌పోర్ట్‌, మ్యారెజ్‌ సర్టిఫికేట్‌ ధృవీకరణ పత్రంగా సమర్పించాల్సి ఉంటుంది. పుట్టిన తేదీలో మార్పునకు కేవలం ఒక్క ఛాన్స్‌ మాత్రమే ఉంటుంది. దీనికి పుట్టిన సర్టిఫికేట్‌ లేదా ఎడ్యుకేషనల్‌ సర్టిఫికేట్‌ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది.  

Aadhar card6/6

ఆధార్‌ కార్డు

ఇక మీ ఆధార్‌ కార్డుపై మొబైల్‌ నెంబర్‌ మార్చుకోవాలంటే ఎన్సిసార్లు అయినా మార్చుకునే సదుపాయం కల్పించారు. దీనికి లిమిట్‌ లేదు. ఒకవేళ మీరు ఇళ్లు మారితే, మీ ఇంటి అడ్రస్‌ ఆధార్‌ కార్డుపై అప్‌డేట్‌ ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు. దీనికి కరెంట్‌ బిల్‌, రెంట్‌ అగ్రిమెంట్‌, బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ సమర్పించాల్సి ఉంటుంది.