Add Zee Business As A Preferred Source
App

Baal Aadhaar: ఐదేళ్లలోపు పిల్లలకు బాల్‌ ఆధార్ కార్డు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

Written ByRenuka Godugu
Published: Oct 03, 2025, 02:41 PM IST|Updated: Oct 03, 2025, 02:41 PM IST

Baal Aadhaar Apply Process: మన దేశంలో ఆధార్ కార్డు ప్రతి ఒక్కరు కలిగి ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో ఏ పథకం పొందాలన్నా.. బ్యాంకు లావాదేవీలు, స్కూల్ అడ్మిషన్ వరకు ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు కలిగి ఉంటారు. అయితే ఐదేళ్ల లోపు ఉన్న పిల్లలకు మాత్రం ఈ రెగ్యులర్ ఆధార్ కార్డు జారీ చేయరు. బాల్ ఆధార్ కార్డు అని జారీ చేస్తారు. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి తెలుసుకుందాం 
 

UIDAI1/5

యుఐడిఏఐ

 బాల ఆధార్ కార్డు అంటే ఐదేళ్లలోపు పిల్లలకు జారీ చేసే ఇది ఆధార్ కార్డు. కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. యుఐడిఏఐ అధికారిక వెబ్‌సైట్లో దీనికి అప్లై చేసుకోవచ్చు. చిన్న పిల్లలకు స్కూల్ అడ్మిషన్ల సమయంలో ఆధార్ నెంబర్ నమోదు చేయమని అడుగుతారు. ఆ సమయంలో బాల్‌ ఆధార్‌ ఉంటే సరిపోతుంది.   

Biometric2/5

బయోమెట్రిక్

 బాల్ ఆధార్ కార్డు అంటే ఐదేళ్ల లోపు ఉన్న పిల్లల కోసం జారీ చేస్తారు. దీనికి బయోమెట్రిక్ డేటా అవసరం ఉండదు. పిల్లల ఫోటో, తల్లిదండ్రుల పత్రాలను మాత్రమే ఉపయోగిస్తారు. దీనికి ఎలాంటి బయోమెట్రిక్‌ కూడా ఉండదు. బాలాధర్ కార్డ్ బ్లూ ఆధార్ కార్డు ని కూడా పిలుస్తారు.   

Baal Aadhaar card3/5

బాల్‌ ఆధార్ కార్డు

 మీ పిల్లలకు బాల్‌ ఆధార్ కార్డు పొందాలంటే కేవలం పుట్టిన సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది. దీనికి తల్లిదండ్రులు లేదా గార్డియన్ ఆధార్ కార్డు, కరెంట్ బిల్ లేదా రేషన్ కార్డు ఏదైనా జత చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. యుఐడిఎఐ అధికారిక వెబ్సైట్లో బ్లూ ఆధార్‌ అపాయింట్మెంట్ సెక్షన్ లోకి వెళ్లి వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.   

Blue Aadhaar4/5

బ్లూ ఆధార్

 ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే మీ పిల్లలకు బ్లూ ఆధార్ కార్డు పోస్ట్ ద్వారా వస్తుంది. లేదా డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తారు. అయితే ఈ ఐదేళ్లలోపు వయసు ఉన్న పిల్లలకు బ్లూ ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత 15 ఏళ్ల లోపు మరోసారి కూడా బయోమెట్రిక్ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.   

Online5/5

 ఆన్‌లైన్

 ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోలేని వారు దగ్గరలో ఉన్న ఆధార్ సేవ కేంద్రానికి వెళ్లి అక్కడ మీరు అపాయింట్‌మెంట్ డేట్ ఫిక్స్ చేసుకొని బాల్‌ ఆధార్‌ కార్డు కోసం షెడ్యూల్ చేసుకోవచ్చు. కేవలం పిల్లల పుట్టిన సర్టిఫికెట్ ఉంటే బాల ఆధార్ కార్డు లభిస్తుంది. దీనికి ఎలాంటి బయోమెట్రిక్ అవసరం లేదు నామినల్ ఫీజు వసూలు చేస్తారు.