Motorola Edge 60 Fusion 5G Discount Offer Price: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో Motorola Edge 60 Fusion 5G స్మార్ట్‌ఫోన్ అత్యంత తగ్గింపు ధరకే అందుబాటులో ఉంది. దీనిపై స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉండడమే కాకుండా అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్, స్పెషల్ ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తోంది.
Motorola Edge 60 Fusion 5G Discount Offer Price News: ఎప్పటినుంచో అత్యంత తక్కువ ధరలోనే మంచి మోటరోలా మొబైల్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన ఆఫర్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్స్‌లో భాగంగా మోటరోలా మొబైల్స్‌కు సంబంధించిన కొన్ని మోడల్స్‌పై ప్రత్యేకమైన బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా అత్యంత చీప్ ధరల్లోనే అందుబాటులో ఉన్నాయి.
1/5ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో ఎడ్జ్ సిరీస్ మొబైల్‌కి మంచి రేటింగ్స్ ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని చాలామంది యువత ఈ మొబైల్స్ అనే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఫ్లిప్‌కార్ట్ కూడా ఈ మోడల్ మొబైల్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ను అందిస్తోంది. ముఖ్యంగా Motorola Edge 60 Fusion 5G మొబైల్ అత్యంత తగ్గింపు ధరకే అందుబాటులో ఉంది.
2/5ఈ Motorola Edge 60 Fusion 5G స్మార్ట్ ఫోన్ ఇప్పుడే కొనుగోలు చేయాలనుకునే వారికి అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. మార్కెట్‌లో ఈ మొబైల్ బేస్ వేరియంట్ ధర MRP రూ.25,999 కాగా.. స్పెషల్ ఆఫర్స్‌తో కేవలం ఇది రూ.22,999 కే అందుబాటులో ఉంది. అయితే, ఇప్పుడే కొనుగోలు చేసే వారికి అదనంగా ఈ మొబైల్ పై బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి.
3/5ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. ఇప్పుడే ఈ మొబైల్ ను కొనుగోలు చేసే వారు మరింత తగ్గింపు పొందడానికి ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఎస్బిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ మై జోన్ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి ఏకంగా రూ.3,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
4/5అంతేకాకుండా ఈ Motorola Edge 60 Fusion 5G మొబైల్‌ను కెనరా బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ అనుసంధాన ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా ఏకంగా రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఆఫర్స్ అన్నీ పోను స్మార్ట్ ఫోన్ కేవలం రూ.19, 935కే లభిస్తుంది. అలాగే అదనంగా భారీ డిస్కౌంట్ పొందడానికి ఫ్లిప్‌కార్ట్ దీనిపై ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ ను కూడా అందిస్తోంది.
5/5ఈ మొబైల్‌కు సంబంధించిన ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్స్‌ను వినియోగించడానికి తప్పకుండా మీ దగ్గర మంచి కండిషన్లో ఉన్న బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్చేంజ్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్చేంజ్ చేస్తే ఏకంగా రూ.18,400 + 2000 వరకు బోనస్ లభిస్తుంది. ఈ బోనస్ ను మొబైల్ ధర నుంచి తీసేస్తే.. ఈ MOTOROLA Edge 60 Fusion 5G స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 435కే పొందవచ్చు.