Aadhaar Card Download: ఆధార్ కార్డును పొందడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఆధార్ సెంటర్‌కు వెళ్లి తీసుకోవడం లేదా UIDAI వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడం సాధారణ పద్ధతులు. కానీ ఇప్పుడు మీరు ఇంటి నుంచే వాట్సాప్ ద్వారా సులభంగా ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది సురక్షితమైన మరియు సులభమైన మార్గం. మరి ఇంకేందుకు ఆలస్యం ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం..
1/5ఆధార్ కార్డు దేశంలో అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డులలో ఒకటి. ఇది ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్, రోజువారీ పనులకు చాలా అవసరం. సాధారణంగా ఆధార్‌ను UIDAI పోర్టల్ లేదా డిజిలాకర్ యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుంటారు.
2/5ఇప్పుడు వాట్సాప్‌లోని MyGov హెల్ప్‌డెస్క్ చాట్‌బాట్ ద్వారా కూడా ఆధార్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో వేరే యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఆధార్‌తో పాటు ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను సురక్షితంగా పొందవచ్చు.
3/5దీనికి మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ మరియు డిజిలాకర్ (DigiLocker) అకౌంట్ అవసరం. లేకపోతే డిజిలాకర్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో అకౌంట్ తయారు చేయాలి. MyGov హెల్ప్‌డెస్క్ వాట్సాప్ నంబర్ +91-9013151515ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకోండి.
4/5వాట్సాప్ ఓపెన్ చేసి ఈ కాంటాక్ట్‌తో చాట్ ఎనేబుల్ చేయండి. చాట్‌లో “Namaste” లేదా “Hi” అని టైప్ చేయండి. అక్కడ ఉండే ఆప్షన్ల నుంచి డిజిలాకర్ సేవలను (DigiLocker Services) ఎంచుకుని, ఇప్పుడు మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
5/5మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. దానిని చాట్‌లో ఎంటర్ చేయండి.వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత చాట్‌బాట్ DigiLockerలో ఉన్న అన్ని డాక్యుమెంట్లను మీకు చూపుతుంది. జాబితా నుంచి ఆధార్‌ను ఎంచుకోవడానికి నంబర్‌ను టైప్ చేయండి. కొన్ని సెకన్లలోపు, మీ ఆధార్ కార్డ్ వాట్సాప్ చాట్‌లో PDF ఫార్మాట్‌లో అందుబాటులో ఉంటుంది.