Bhang Hangover: దేశమంతా రేపు హోలీ ఉత్సవాలు అంబరాన్ని అంటనున్నాయి. హోలీ వేడుకల్లో రంగుల్లో మునిగి తేలనున్నారు. రుచికరమైన వంటలు ఆస్వాదిస్తారు. స్వీట్లు పంచుకుంటారు. అన్నింటికీ మించి హోలీ రోజున భంగ్ మత్తు పానీయం తప్పకుండా తాగుతారు.
Bhang Hangover: భంగ్ పానీయంతో ఒళ్లంతా మత్తు ఆవహిస్తుంది. సాధారణంగా చాలా సేపటి వరకూ ఈ మత్తు దిగదు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే కాస్సేపట్లోనే మత్తు దిగిపోవచ్చు. ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.
లెమన్ వాటర్ లెమన్ పులుపుగా ఉండటం వల్ల హోలీ రోజున తీసుకునే భంగ్ పానీయం మత్తు దిగేందుకు లెమన్ వాటర్ బెస్ట్ ఆప్షన్. గోరు వెచ్చని గ్లాసు నీళ్లలో నిమ్మరసం కలిపి తాగాలి. లెమన్ లేకపోతే ఆరెంజ్, బత్తాయి, ఉసిరి కూడా తీసుకోవచ్చు.
పెరుగు మజ్జిగ పెరుగు మజ్జిగ తాగడం వల్ల మత్తు సునాయసంగా దిగుతుంది. చల్లటి మజ్జిగలో కొద్దిగా జీలకర్ర వేసి తాగితే మంచి ఫలితాలుంటాయి.
కొబ్బరి నీళ్లు కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అంతేకాకుండా భంగ్ పానీయం మత్తు దిగేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. మత్తు ఎక్కువైనప్పుడు కొబ్బరి నీళ్లు తాగమని పెద్దలు సూచిస్తుంటారు
అల్లం భంగ్ పానీయం మత్తు దిగేందుకు అల్లం అద్భుతంగా పని చేస్తుందంటారు. అల్లం చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక్కొక్కటి నోట్లో పెట్టుకుని నెమ్మదిగా నమలాలి. అల్లం రసం కారణంగా మత్తు నెమ్మదిగా దిగుతుంది. అల్లం మింగకుండా జాగ్రత్త పడండి. లేకపోతే నేరుగా అల్లం రసం తీసి తాగవచ్చు