Add Zee Business As A Preferred Source
App

Health Tips: పూరీలు నూనె ఎక్కువగా పీల్చేస్తున్నాయా..? ఆయిల్‌లో ఇదొక్కటి కలపండి చాలు.. మీరే ఆశ్చర్యపోతారు..!

Written ByAruna Maharaju
Published: Sep 22, 2025, 07:42 PM IST|Updated: Sep 22, 2025, 07:42 PM IST

Oil Free Poori Tips: పూరీలు అంటే ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. ప్రతి ఒక్కరూ టిఫిన్స్‌లో ఇష్టంగా తినేది కూడా పూరీనే. అయితే నచ్చిన ఫుడ్ అయినప్పటికీ.. పూరీలను నూనెలో వేయించడం వల్ల ఎక్కువగా తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చాలా మంది అవాయిడ్ చేస్తుంటారు. ఈసారి పూరీలు చేసేటప్పుడు నూనెలో ఒక్క స్పూన్ ఈ పదార్థం కలిపితే చాలు.. కొంచెం కూడా ఆయిల్ పీల్చకుండా బూరెల్లాగా పొంగుతాయి పూరీలు.

Oil Free Poori Tips1/5

నూనె తక్కువగా పీల్చేలా పూరీల తయారీ

పూరీలు అంటే అందరికీ ఎంతో ఇష్టం. పండుగల్లో లేదా ఇంట్లో ప్రత్యేక సందర్భాల్లో పూరీలు లేకపోతే భోజనం పూర్తి కాదనిపిస్తుంది. కానీ పూరీలను నూనెలో వేయించడం వల్ల అందులో కేలరీలు, ఫ్యాట్ ఎక్కువగా ఉంటాయని.. దీనివల్ల కొలెస్ట్రాల్, ఊబకాయం వంటి సమస్యలు రావచ్చని చాలా మంది వాటిని తినడానికి భయపడతారు.

Oil Free Poori Tips2/5

పూరీలు నూనె పీల్చేస్తున్నాయా

అయితే రుచి తగ్గకుండా, ఆరోగ్యానికి హాని కలగకుండా, నూనె ఎక్కువగా పీల్చకుండా.. పూరీలను చేసుకునే సులభమైన పద్ధతి ఉంది. ఈ విధంగా తక్కువ నూనెతో లేదా నూనె లేకుండా కూడా పూరీలు చేసుకోవచ్చు.

 

Oil Free Poori Tips3/5

పూరీలు

ముందుగా ఒక కప్పు గోధుమపిండిలో కొంచెం ఉప్పు, రెండు స్పూన్ల పుల్లని పెరుగు లేదా సోర్ క్రీం కలిపి బాగా మెదపాలి. ఇది పూరీలను మెత్తగా, పొంగేలా చేస్తుంది. తర్వాత కొంచెం గోరువెచ్చని నీళ్లు పోసి పిండిని మెత్తగా పిసికి, తడి గుడ్డలో చుట్టి అరగంట పక్కన ఉంచాలి. ఇలా చేస్తే పూరీలు మృదువుగా వస్తాయి.

 

పూరీలు క్రిస్పీగా రావాలంటే4/5

పూరీలు క్రిస్పీగా రావాలంటే

ఆ తర్వాత పిండిని చిన్న ఉండలుగా చేసి, పొడి పిండి బదులు కొంచెం నూనె ఉపయోగించి పూరీలను సమానంగా ఒత్తాలి. ఎక్కువ పల్చగా లేదా మందంగా ఉంటే పూరీలు బాగా పొంగవు.

Oil Free Poori Tips5/5

పూరీలు బాగా పొంగాలంటే

ఇక పూరీలను వేయించడానికి సరిపడా నూనెను కడాయిలో తీసుకొని వేడయ్యాక.. అందులో ఒక టీ స్పూన్ ఆయిలో వేయాలి. అవును మీరు చదివింది నిజమే. నూనెలో ఉప్పు వేయడం వల్ల పూరీలు నూనెను అస్సలు ఎక్కువగా పీల్చుకోవు. ఇలా చేస్తే పూరీలు పొంగి, క్రిస్పీగా వస్తాయి. ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా ఈ టిప్‌ని ట్రై చేయండి.