Current bill reduction: చలికాలం ఫ్యాన్, ఏసీ లాంటివి ఏవి కూడా మనం పెద్దగా వాడము. కానీ వేసవి కాలం వచ్చిందంటే చాలు.. ఫ్యాన్లు..కూలర్లు, ఏసీలు..ఫ్రిజ్‌లు నిరంతరం నడుస్తాయి. దీంతో కరెంటు మీటర్ వేగంగా తిరుగుతుంది. అయితే కాలం ఏదైనా కూడా.. కరెంట్ బిల్లు మాత్రం వేలల్లో వస్తుంది. ఈ సమస్యకు మంచి పరిష్కారం ఏమిటో తెలుసా..?
1/6కాలంతో సంబంధం లేకుండా ప్రస్తుతం అందరికీ కూడా కరెంట్ బిల్ వేళల్లో వస్తోంది. మినిమం మూడు వేల పైనే ప్రతి ఒక్కరికి కరెంట్ బిల్ ఉంటుంది. ఈ క్రమంలో కరెంట్ బిల్ తగ్గించుకోవాలి అంటే.. ఈ చిన్ని పని చేయడం చాలా ఉత్తమం. అదేమిటి అంటే ఇంటి పైన సోలార్ ప్యానల్ పెట్టించుకోవడం..
2/6సోలార్ ప్యానెల్స్‌లో ఉన్న ఫోటోవోల్టాయిక్ సెల్స్ (Photovoltaic Cells) సూర్యరశ్మిని గ్రహించి దాన్ని విద్యుత్‌గా మారుస్తాయి. ఈ విద్యుత్‌ను ఇంట్లోని ఫ్యాన్లు, బల్బులు, ఫ్రిజ్, టీవీ లేదా ఏసీ వంటి పరికరాలను నడిపించడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ విధానం పర్యావరణానికి అనుకూలంగా ఉండడంతో పాటు, కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
3/6ఇది ఇంటి విద్యుత్ వినియోగంపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా 1 కిలోవాట్ (kW) సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయాలంటే రూ.70,000 నుంచి రూ.85,000 వరకు ఖర్చు అవుతుంది. ఈ సామర్థ్యంతో 3-4 ఫ్యాన్లు, 5-6 LED లైట్లు సులభంగా నడుస్తాయి. మీరు ఆన్-గ్రిడ్ సిస్టమ్‌ను ఎంచుకుంటే ఖర్చు తక్కువగా ఉంటుంది. అదనంగా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ప్రభుత్వానికి అమ్మి నెలకు కొంత ఆదాయం పొందవచ్చు.
4/6భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నాయి. MNRE (Ministry of New and Renewable Energy) ద్వారా 20% నుండి 50% వరకు సబ్సిడీ లభిస్తుంది. దీని కోసం రాష్ట్ర డిస్కాం (DISCOM) కార్యాలయాన్ని సంప్రదించాలి. అప్రూవ్డ్ వెండర్ ద్వారా ఇన్‌స్టాలేషన్ చేయించుకోవడం మంచిది.
5/6సాధారణంగా 4 నుండి 6 సంవత్సరాలలో పెట్టుబడి మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. ఆ తర్వాత 20-25 సంవత్సరాల పాటు ఉచిత విద్యుత్ లభిస్తుంది. దీర్ఘకాలంలో ఇది అత్యంత లాభదాయకమైన పెట్టుబడిగా చెప్పవచ్చు.
6/6ఎవరింటి పైకప్పుపై మంచి ఎండ పడుతుందో వారికి సోలార్ ప్యానెల్స్ చాలా ప్రయోజనకరం. నెలకు రూ.1,000 కంటే ఎక్కువ కరెంటు బిల్లు వస్తున్న కుటుంబాలకు ఇది సరైన పద్ధతి. అంతేకాకుండా ప్రస్తుతం వర్షాకాలం, చలికాలం అనే సంబంధం లేకుండా మనకి రోజులో ఏదో కాసేపైనా ఎండ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి.. మనకు ఏ కాలమైనా సోలార్ సిస్టం పనిచేస్తుంది.