Add Zee Business As A Preferred Source
App

Remove Crayon Marks From Wall: ఇలా చేస్తే ఇక మీ పిల్లలు గోడలపై గీసిన మారకలు అన్నీ కూడా మాయం..!

Written ByVishnupriyaUpdated byVishnupriya
Published: Sep 03, 2025, 07:19 PM IST|Updated: Sep 03, 2025, 07:19 PM IST

Remove Sketch Pen Marks From Walls: చిన్నపిల్లలు ఉంటే చాలు ఆ ఇంట్లో గోడలపై.. మొత్తం కూడా స్కెచ్ పెన్ మాడకలతో నిండిపోయి ఉంటాయి. ఒక దగ్గర కాదు ఇల్లు మొత్తం గీసేస్తూ ఉంటారు. ముఖ్యంగా అద్దె ఇళ్ల ల్లో మళ్ళీ మొత్తం పెయింట్ వేయాలి అన్నప్పుడు డబ్బులు కూడా ఎక్కువ అవుతాయి.. మీరు కూడా ఈ సమస్య ఎదుర్కొంటూ ఉంటే.. ఈ చిట్కా ఫాలో అవ్వండి..
 

How To Clean Wall Stains1/5

చిన్నపిల్లలు తరచుగా క్రేయాన్స్ ఎత్తుకొని ఇంట్లో గోడలపై మొత్తం గీసేస్తూ ఉంటారు.. ఇది కాస్త గోడలపై మరకలుగా మిగిలిపోతాయి.. ఇక దీన్ని నీళ్లతో తుడిస్తే పెయింట్ వచ్చేయడం తప్ప ఆ మరకలు మాత్రం పోవు. 

Remove Stains From Walls2/5

ముఖ్యంగా అద్దె ఇంట్లో ఉన్న వాళ్లకి.. మొత్తం ఇల్లు మరోసారి పెయింట్ వేయించాలి అన్న అనవసరంగా డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. మరి ఇలాంటి సమస్యకి .. ఇంట్లోనే లభించే వస్తువులతో మనం పరిష్కారం చేసుకోవచ్చు. 

Baking Soda For Wall Stains Removal 3/5

గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా బేకింగ్ సోడా కలుపుకోవాలి. ఇది సొల్యూషన్ లాగా చేసుకున్న తర్వాత.. ఒక క్లాత్ తీసుకొని ఈ నీళ్లను అది మరకలు ఉన్న దగ్గర అంతా తురవాలి. ఇలా చేస్తే పెయింటింగ్ పోకుండా మరకలు పోతాయి. 

Paste For Wall Marks Removal 4/5

మరో చిట్కా ఏమిటి అంటే ఒక బ్రష్ తీసుకుని దానిపైన పేస్ట్ వేసుకొని.. ఆ పేస్టు తో గోడ పైన మరకలు ఉన్న దగ్గర అంతా తుడవాలి. కాసేపయ్యాక ఒక తడి క్లాత్ తీసుకొని ఆ పేస్టు మొత్తం తుడిపేయాలి. ఇలా చేస్తే కూడా పెయింట్ పోకుండా మరకలు పోతాయి. 

Do Patch Test5/5

అయితే ఈ రెండిట్లో ఏదైనా ట్రై చేసి ముందు ఎక్కడన్నా ఒక దగ్గర అప్లై చేసి ట్రై చేయండి. అక్కడ అవి పోతున్నాయా లేదా చూసి ఆ తర్వాత మాత్రమే ఈ ప్రాడక్ట్స్ ఉపయోగించండి. ఎందుకంటే కొన్ని రకాల పెయింట్ కలర్స్ పై ఈ చిట్కాలు ఉపయోగపడకపోవచ్చు.