Amla Juice: కేవలం 30 రోజుల్లో.. బరువు తగ్గడంతో పాటు కాంతివంతంగా తయారవ్వాలంటే.. ఉసిరితో ఇలా చేయండి..

Why Amla : ఉసిరి మన ఆరోగ్యానికి ఎంతో మేలుచేసే ఆహార పదార్థాలు. ఉసిరికాయ..విటమిన్ C, యాంటీ ఆక్సిడెంట్స్.. ఇతర పోషకాలతో నిండి ఉంటుంది. ఇటీవల న్యూట్రిషనిస్ట్ డాక్టర్ శిఖా సింగ్ సోషల్ మీడియాలో ఆమ్లాతో తయారుచేసే ఒక జ్యూస్ రిసిపీని పంచుకున్నారు. ఆమె చెప్పిన విధంగా ఉసిరికాయ జ్యూస్‌ను రోజూ తీసుకుంటే ఒక నెలలోనే శరీరంలో.. మంచి మార్పు కనిపిస్తుందని తెలిపారు.

1 /5

ఉసిరికాయలో విటమిన్ C అధికంగా ఉండటంతో ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది రక్తాన్ని శుభ్రం చేస్తుంది, చర్మం కాంతివంతంగా మారుతుంది. అలాగే జుట్టు బలంగా, మెరుస్తూ ఉండేలా చేస్తుంది.

2 /5

డైట్‌లో ఉసిరికాయ రసం ఎలా చేర్చుకోవాలి? డాక్టర్ శిఖా చెప్పిన ప్రకారం.. ఈ జ్యూస్‌ను ఉదయం ఖాళీ కడుపుతో తాగడం ఉత్తమం. దీనికి అవసరమైన పదార్థాలు సులభంగా లభిస్తాయి.

3 /5

1 ఉసిరికాయ  ఒక చిన్న ముక్క కచ్చి పసుపు (టర్మరిక్ రూట్)  ఒక చిన్న ముక్క అల్లం  6-7 కరివేపాకు  చిటికెడు నల్ల మిరియాలు తయారీ విధానం: ఈ అన్ని పదార్థాలను మిక్సీలో వేసి నీళ్లు కొద్దిగా జోడించి బాగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టి తాగాలి.

4 /5

ఉసిరికాయ ర బాడీ మెటాబాలిజంను వేగంగా చేస్తుంది. దీనివల్ల కొవ్వు త్వరగా కరుగుతుంది. విటమిన్ C.. యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల చర్మం నిగారింపు పొందుతుంది. రోజూ ఈ జ్యూస్ తాగడం వల్ల జుట్టు..రాలడం తగ్గి మెరుస్తూ ఉంటుంది. అల్లం..కరివేపాకు జీర్ణశక్తిని పెంచి శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తాయి.  

5 /5

వివాహానికి ముందు తమ చర్మం మెరిసేలా చేయాలనుకునే యువతులు.. వజన్ తగ్గించుకోవాలనుకునే వారు లేదా జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు ఈ జ్యూస్‌ను తప్పక ప్రయత్నించవచ్చు.