Hyderabad: వణుకుతున్న హైదరాబాద్‌.. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు, 7 ఏళ్లలో రికార్డు బ్రేక్‌..!

Lowest Temperatures In Hyderabad: వణికిపోతున్న హైదరాబాద్.. కనిష్ట ఉష్ణోగ్రతలో రికార్డు బ్రేక్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో భాగ్యనగర వాసులు చలితో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ సందర్భంగా పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ కూడా జారీ చేసింది హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం 
 

1 /7

 భాగ్యనగరం వణికిపోతుంది. రాను రాను ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం మబ్బులు కమ్మేసి రోడ్లన్నీ పొగమంచ కమ్మేసింది. ఈ నేపథ్యంలో ప్రజల రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వారం రోజుల్లో అత్యల్పంగా సగటున 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి.  

2 /7

 హైదరాబాద్ వ్యాప్తంగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అత్యంత కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు చేరుకోవటంతో ప్రజలు వణికిపోతున్నారు. వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం, రాత్రి పొగ మంచు ఉండటంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.  

3 /7

 ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. అంతేకాదు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలో రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతల్లో నేపథ్యంలో నిన్న 28 జిల్లాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి కోహిర్‌లో అత్యల్పంగా 5.8 డిగ్రీలు నమోదయ్యాయి.  

4 /7

ఆదిలాబాద్ ,ఆసిఫాబాద్, మెదక్, నిర్మల్ జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంది. రానున్న మూడు రోజులు కూడా చలి తీవ్రత మరింత ఎక్కువవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అయితే ఈ కనిష్ట ఉష్ణోగ్రతల రికార్డులో ఏడేళ్లలో ఇది తొలిసారి. ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం.  

5 /7

 ఏడేళ్లలో మొదటిసారి సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో 6.3 డిగ్రీలు నమోదు కావడం గమనార్హం. మౌలాలి 7, రాజేంద్రనగర్ లో 7, శివరాంపల్లి 8, గచ్చిబౌలి 9, బొల్లారం 9, మారేడుపల్లి 10, కుత్బుల్లాపూర్ 10, జీడిమెట్ల 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది.  

6 /7

 ఈ నేపథ్యంలో ప్రయాణికులు ఉదయం, రాత్రి సమయంలో ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. లేకపోతే యాక్సిడెంట్లకు గురయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హెడ్ లైట్స్ సరిగా ఉండేలా చూసుకోవాలి. రోడ్ రూల్స్ పాటించాలని తెలిపింది. వృద్దులు, గర్భిణులు కూడా ఆ సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.  

7 /7

 ప్రతిరోజు వేడి వేడి ఆహారం తీసుకోవడానికి మాత్రమే ప్రయత్నించండి. రోడ్డు సైడ్ విక్రయించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. ఎప్పటికప్పుడు చలి ఉన్న నేపథ్యంలో స్వెటర్లు, టోపీలు ధరించడం మంచిది. లేకపోతే నిమోనియా వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఈ జాగ్రత్తలు పాటించాలి.