CP Sajjanar: మరోసారి గన్ ఎక్కుపెట్టిన సీపీ సజ్జనార్.. ఎక్స్‌లో సంచలన పోస్ట్.. ఇంకా దబిడి దిబిడే..

cp sajjanar gun firing session in tgpa: సీపీ సజ్జనార్ మరోసారి గన్ ఎక్కుపెట్టారు.ఈ క్రమంలో ఎక్స్ లో ఆయన పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. దీనిపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

1 /5

సీపీ సజ్జనార్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఢిల్లీ లెవల్ లో కూడా సీపీ సజ్జనార్ అంటే ఒక ప్రత్యేకత ఉంది. గతంలో వరంగల్ లో యువతిపై యాసిడ్ దాడి, వెటర్నరీ డాక్టర్ పై అత్యాచారం, హత్య ఘటనల్లో నిందితుల పాలిట సింహా స్వప్నంలా మారారు. అప్పట్లో సీపీ సజ్జనార్ ను ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ అని కూడా బ్రాండ్ తో వెలిగిపోయారు.

2 /5

ఆ తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనను అనూహ్యంగా ఆర్టీసీ ఎండీగా నియమించిది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం మరల వీసీ సజ్జనార్ ను సీపీగా బాధ్యతలు అప్పగించింది. విధుల్లో చేరిన కొన్నినెలల్లోనే రౌడీ షీటర్లకు, చోరీలు, చైన్ స్నాచర్ లకు సీపీ సజ్జనార్  చుక్కలు చూపించారు.  

3 /5

అంతేకాకుండా.. శాంతి భద్రతల్లో ఎక్కడ కూడా రాజీపడేది లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా పోస్ట్ లు, ట్రోలర్స్ కు ఇప్పటికే మాస్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు.. రౌడీషీటర్లు రెచ్చిపోతే.. పీడీయాక్టులు తెరుస్తామన్నారు. దీనితో పాటు.. సైబర్, ఆర్థిక నేరాల కట్టడికి చర్యలు తీసుకున్నారు. డ్రగ్స్ పై కూడా కఠిన చర్యలు తీసుకున్నారు.   

4 /5

ఈ నేపథ్యంలో తాజాగా... సీపీ సజ్జనార్..ఇవాళ ఉద‌యం హైద‌రాబాద్ శివార్ల‌లోని తెలంగాణ పోలీసు అకాడ‌మీకి సీపీ స‌జ్జ‌నార్ వెళ్లారు. ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్టుగా పేరొందిన ఐఏఎస్ ఆఫీస‌ర్ వీసీ స‌జ్జ‌నార్ మ‌ళ్లీ తుపాకీ ప‌ట్టి అందరిని మరింత ఉత్సహపరిచారు. హైద‌రాబాద్ సిటీ పోలీసు బృందంతో క‌లిసి ఆయ‌న పిస్ట‌ల్‌తో షూటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ క్రమంలో సీపీ సజ్జనార్ పలు మార్లు గన్ ఫైరింగ్ ప్రాక్టిస్ చేశారు. ఆ తర్వాత ఎక్స్ లో పోస్ట్ కూడా చేశారు.  

5 /5

షూటింగ్ రేంజ్‌కు వెళ్ల‌డం, ల‌క్ష్యం గురి త‌ప్ప‌కుండా కొట్ట‌డం ఎప్పుడూ గొప్ప అనుభూతిని ఇస్తుంద‌న్నారు. బుల్స్ ఐకి గురిపెట్టి కొట్ట‌డం థ్రిల్లింగ్‌గా కూడా ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ను సీపీ స‌జ్జ‌నార్ స్వ‌యంగా త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. దీంతో మరోసారి సీపీ సజ్జనార్ సర్ గన్ పట్టారని ఇంకా రౌడీ షీటర్లకు, అక్రమాలకు పాల్పడే వారికి దబిడి దిబిడే అంటూ నెటిజన్లు ఫిదా అవుతున్నారు.