Hyderabad Heatwaves Alert: రానున్న మూడు రోజులపాటు ఎండ వేడిమి మరింత పెరుగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రజలకు కీలక సూచన చేసింది. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా దాటేస్తోంది. అయితే ప్రజలు ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని కొన్ని సూచనలు చేసింది.
1/5ఎండ వేడిమి ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు నీళ్లు అధికంగా తాగాలని సూచించింది. దాహం లేకున్నా కానీ నీటిని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో తయారు చేసుకున్న మజ్జిగ, నిమ్మకాయ నీరు, ఓఆర్ఎస్ కు ప్రాధాన్యత ఇవ్వండి. ఇది మన శరీరానికి కావాల్సిన హైడ్రేషన్ అందిస్తుంది.
2/5అంతేకాదు నీటి శాతం అధికంగా ఉండే పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యత ఇవ్వండి. పుచ్చకాయ, ఆరెంజ్, కీరదోసకాయ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. ఈ పండ్లను కూరగాయలను డైట్లో చేర్చుకోవాలి.
3/5ఎండలు అధికంగా ఉన్న సమయంలో ఇంట్లోనే ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు. అంతేకాదు ఎండ సమయంలో ఇంటి కిటికీలను మూసి ఉంచాలి. తద్వారా ఎండ వేడిమి ఎక్కువగా ఉండదు. సాయంత్రం వేళలో వాటిని తెరిచి ఉంచాలని సూచించింది.
4/5ఎక్కడికి వెళ్లినా తమతో పాటు నీటిని తీసుకువెళ్లాలని సూచించింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్యలో బయట తిరగకూడదని చెప్పారు. అంతేకాదు ఈ సమయంలో ఫిజికల్ యాక్టివిటీలు కూడా చేయకూడదు.
5/5వెంటిలేషన్ సరిగా లేని ప్రాంతంలో వేడి పదార్థాలు వండకూడదు. దీంతో ఇంట్లో మరింత వేడి పెరుగుతుంది. అంతేకాదు చక్కెర, కెఫీన్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోకూడదు. కార్బోనేటెడ్ డ్రింక్స్ కూడా దూరంగా ఉండాలి. మసాలా ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోకూడదు.