Hyderabad Metro Rail L&T Big Shock to Passengers: భాగ్యనగర వాసులకు హైదరాబాద్ రైళ్లను నిర్వహిస్తూన్న ఎల్ అండ్ టీ సంస్థ బిగ్ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లో మెట్రో రైళ్లను తమ వళ్ల కాదని చేతులేత్తయడమే కాకుండా.. కేంద్రానికి లేఖ రాయడం సంచలనం రేపుతోంది.
1/5Hyderabad Metro Rail: హైదరాబాద్ మెట్రో రైలను నడపలేమంటూ ఎల్ అండ్ టీ తేల్చి చెప్పేసింది. నష్టాలతో మెట్రో నిర్వహణ తమ వల్ల కాదంటోంది. అంతేకాదు పెరిగిన మెయింటెన్స్ తో ఇక మెట్రో నడపలేమంటూ కేంద్రానికి ఎల్ అండ్ టీ ఓ లేఖ రాసింది.
2/5ఈ ప్రాజెక్టును కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఒకవేళ మెట్రో నిర్వహణ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్ ఎస్పీవీని ఏర్పాటు చేసి అప్పగించాలని సూచించినా సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. ఆర్థికంగా భారంగా పరిణమించిన మెట్రోరైల్ నిర్వహణ తమ వల్ల కాదంటూ చేతులెత్తేసింది.
3/5వరుస నష్టాలు, పెండింగ్ బకాయిల దృష్ట్యా రైళ్లను నడపడం కష్టంగా ఉన్నట్లు ఇటీవల కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాకపోవడంతో టికెట్‌లపై వచ్చే ఆదాయం రైళ్ల నిర్వహణకు చాలడం లేదంటున్నారు.
4/5మొత్తంగా కమర్షియల్ యాడ్స్..టికెట్ వల్ల కూడా మెట్రో రైళ్ల కష్టాలు తీరడం లేదంటున్నారు. మొత్తంగా పలు కారణాల దృష్ట్యా మెట్రో రైళ్లు నడపడం తమకు కష్టంగా ఉన్నట్లు ఎల్‌అండ్‌టీ వెల్లడించింది. నిర్వహణ ఖర్చులు, విద్యుత్‌చార్జీలు, ఉద్యోగుల జీతభత్యాలు, తదితర ఖర్చులు పెనుభారంగా మారినట్లు పేర్కొంది.
5/5ప్రతిరోజూ 5 లక్షల మందిని గమ్యస్థానాలకు హైదరాబాద్ మెట్రో చేరుస్తోంది. యాడ్స్, లీజుల ద్వారా అదనపు ఆదాయం వస్తున్నా.. భారం తప్పడం లేదని ఎల్ అండ్ టీ స్పష్టం చేసింది.