Hyderabad: అన్నీ క్లోజ్‌.. చికెన్‌, మటన్‌ షాపులు బంద్‌ సీపీ ఆనంద్‌ కీలక ఆదేశాలు..

Non Veg Shops Closed in Hyderabad: హైదరాబాద్‌లో ప్రత్యేక ఆంక్షలు విధించారు. మార్చి 14వ తేదీ హోలీ పండుగ సందర్భంగా నగరంలో చికెన్‌, మటన్‌ విక్రయాలు నిలిపివేయాలని హైదరాబాద్‌ సీపీ ఆనంద్‌ ఉత్తర్వులు  జారీ చేశారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
 

1 /5

హోలీ పండుగ మన దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే స్కూళ్లు, విద్యాసంస్థలకు కూడా ఈ పండుగ రోజు సెలవులు ప్రకటించారు. అయితే, తాజాగా హైదరాబాద్‌ సీపీ ఈ ప్రాంతాల్లో హోలీ పండుగ రోజు చికెన్‌, మటన్‌ విక్రయించకూడదని ఆదేశించారు.  

2 /5

ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. హోలీ పండుగ అంటే రేపు ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు చికెన్‌, మటన్‌ విక్రయించే దుకాణాలు బంద్‌ చేయాలని ఆదేశించారు.  

3 /5

ఇప్పటికే నిన్న వైన్‌ షాపులు కూడా రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్‌ చేయాలని ఆదేశించారు. తాజాగా, చికెన్, మటన్‌ విక్రయించే దుకాణాలు కూడా బంద్‌ చేయాలని హైదరాబాద్‌ సీపీ ఆనంద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  

4 /5

హోలీ పండుగ కాబట్టి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదని రోడ్డుపై వెళ్తున్న వారిపై అకారణంగా రంగు జల్లితే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. వారిపై చర్యలు కూడా తీసుకుంటామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవన్నారు.  

5 /5

హోలీ పండుగ సందర్భంగా అన్ని బంద్‌ ఉండనున్నాయి. మార్చి 14వ తేదీ హోలీ పండుగ. ఇక ఈరోజు రాత్రి హోలికా దహనం చేస్తారు. ఆ మరుసటి రోజు హోలీ జరుపుకుంటారు. ఆ పండుగ సందర్భంగా ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈరోజు బ్యాంకులు కూడా బంద్‌ ఉండనున్నాయి.