Hyderabad Real Estate: సిటీ మధ్యలో తక్కువ ధరకే ఇండిపెండెంట్ ఇండ్లు, ఫ్లాట్లు..హైదరాబాద్‌లో ఈ ఏరియాపైనే అందరి దృష్టి.!
Hyderabad: హైదరాబాద్ నగరానికి నిత్యం వేలాది మంది ఉపాధి కోసం వస్తుంటారు. ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు తమ కార్యాలయాలను తెరుస్తున్నాయి. ఈ క్రమంలో నైపుణ్య వంతులకు కూడా మంచి డిమాండ్ ఉంది. అందులో చాలా మంది భాగ్యనగరంలోనే స్థిరనివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో నగర శివారుల్లో కొత్త కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి.
అయితే ప్రస్తుతం నగరానికి ఆనుకుని ఉన్న అల్వాల్, బొల్లారం, కొంపల్లి ఏరియాలో కొత్త కొత్త కాలనీలు ఏర్పాడుతున్నాయి. వెంచర్లను ఏర్పాటు చేసి ఫ్లాట్లను అమ్ముతున్నారు. అల్వాల్ ఏరియా నుంచి బొల్లారం టు కోంపల్లి వరకు కొత్త కొత్త కాలనీలు ఎన్నో ఏర్పడ్డాయి. ఇక్కడికి ఔటర్ రింగ్ రోడ్డు, కరీంనగర్ హైవే, నిజామాబాద్ హైవే దగ్గర ఉండటంతో ఇక్కడ ఇండ్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే ఈ బొల్లారం, అల్వాల్ ఏరియాలు కంటోన్మెంట్ పరిధిలోకి వస్తాయి. కాబట్టి ఇక్కడ బహుళ అంతస్తుల భవనాలు కట్టేందుకు పర్మిషన్ ఉండదు. కేవలం 5అంతస్తుల వరకు మాత్రమే ఇళ్లను నిర్మించేందుకు పర్మిషన్ ఇస్తుంటారు. అయితే ఈ ఏరియాలో చాలా మంది ఇండిపెండెంట్ ఇళ్లను నిర్మించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం, ఎక్కువగా గ్రీనరీ ఉంటుంది. ఈ ఏరియాల్లో సాఫ్ట్ వేర్లు ఎక్కువగా స్థిరపడుతున్నారు.
ఐటీ ఉద్యోగులకు ఈ ఏరియాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే సుచిత్ర, షాపూర్ నగర్, ఉషాముళ్లపుడి వరకు ట్రాఫిక్ లేకుండా డైరెక్టుగా కూకట్ పల్లి జేఎన్టీయూకు చేరుకోవచ్చు. అందుకే ఈ ఏరియాల్లో ఇండ్లు కొనేందుకు ఐటీ ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఈ ప్రాంతాల్లో ఇళ్లకు గిరాకీ కూడా భారీగా పెరిగింది.
బొల్లారం, అల్వాల్, సుచిత్ర వరకు 150 అడుగుల జీహెచ్ఎంసీ రోడ్డు ఉంది. దీంతో కొత్త ఇళ్లు కొనేవారు ఈ ప్రాంతాలను ఇష్టపడుతున్నారు. ఇప్పటికే ఈ రోడ్డు ఇరు వైపులా దుకాణాలు, కాంప్లెక్సులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇళ్ల స్థలాలు గజం రూ. 25వేల నుంచి రూ. 50వేల వరకు పలుతున్నాయి. 40 అడుగుల రోడ్లు ఉన్న కాలనీల్లో గజం ధర రూ. 1.5 లక్షలకుపైమాటే ఉంది. ఈ ఏరియా అన్నింటికి సౌలభ్యంగా ఉండటంతో ఈ ప్రాంతాల్లో ఫ్లాట్లు కొనేందుకు ప్రజలు ఆసక్తి కనబర్చుతున్నారు.
అంతేకాదు ఉపాధి కోసం కొత్త నగరానికి వస్తున్న ఉద్యోగులు, ప్రధానంగా ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న వారు ఈ ప్రాంతాల్లో సొంతంగా ఇల్లను కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏరియాల్లో అద్దె కూడా బాగుంటుంది. డబుల్ బెడ్ రూమ్ ఇంటికి కనీసం 8వేల నుంచి 12 వేల వరకు ఉంది. పార్కింగ్ సౌకర్యాలు ఉన్న ఇండ్లు అయితే 15వేలకు ఉంటుంది. త్రిబుల్ బెడ్ రూమ్ అయితే 25వేల వరకు చెల్లించాల్సి వస్తోంది.
మీరు కూడా ఇల్లు కొనే ప్లాన్ లో ఉన్నట్లయితే ఈ ఏరియాల్లో ట్రై చేయడం బెటర్. పిల్లల స్కూల్లకు, ఆఫీసులకు, ప్రశాంతతకు మారుపేరుగా ఈ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఓసారి ఆలోచించడం బెటర్.