Hyderabad Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మాంచి జోరుమీదున్నట్లు కనిపిస్తోంది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, రంగారెడ్డి, సంగారెడ్డిలలో రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా పెరగడమే దీనికి ప్రధానకారణమని చెప్పవచ్చు.
గత ఏడాది మే నెలతో పోలిస్తే ఈ ఏడాది మేలో దాదాపు 14శాతం పెరుగుదల నమోదు అయ్యింది. గత నెలలో రంగారెడ్డి జిల్లాలో 48శాతం రిజిస్ట్రేషన్లు జరిగాయి. మేడ్చల్ మల్కాజ్ గిరిలో 37శాతం, హైదరాబాద్ జిల్లాలో 15శాతం రిజిస్ట్రేషన్లు నమోదు అయ్యాయి. ఈ పరిస్థితులు ఇలా ఉంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో అత్యధిక భాగం రంగారెడ్డి జిల్లా పరిధిలోనే జరుగుతున్నాయి.
తాజాగా ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన లింక్డిన్ వేదికగా పోస్టు చేసిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
బెంగళూరు, ముంబై, గురుగ్రామ్, ఢిల్లీ వంటి నగరాల్లో రియల్టీ బూమ్ ఉందని అంతా అనుకుంటారు. కానీ అది నిజం కాదు. 2020 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు4ఏళ్లకాలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దుమ్మురేపిందంటూ చెప్పుకొచ్చారు.
గత నాలుగేళ్ల కాలం నుంచి టాప్ మెట్రో నగరాలను పరిశీలించినట్లయితే హైదరాబాద్ రియాల్టీరంగమే ఇన్వెస్టర్లకు 80శాతం ఆదాయాన్ని అందించినట్లుతెలిపారు. ఈ భారీ వృద్ధి ముందు మిగిలిన ప్రధాన నగరాలు చాలా తక్కువగానే వృద్ధి నమోదు చేశాయన్నారు. హైదరాబాద్ రియాల్టీ 80శాతం రాబడిని అందించగా..రెండవ స్థానంలో నోయిడా 70శాతం రాబడిని అందించిందని తెలిపారు. గుర్గావ్ ను 60శాతంతో రెండవ స్థానంలో నిలిపింది.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో 45శాతం రాబడి వచ్చింది. ఐటీ రాజధాని బెంగళూరులో ఇన్వెస్టర్లకు 45శాతం రాబడి అందించింది. భారత ఆర్థిక రాజధాని ముంబైలోని రియాల్టీ రంగం పెట్టుబడిదారులకు కేవలం 40శాతం రిటర్న్స్ మాత్రమే అందించింది.
కోల్ కతా 25శాతం వరకు ఆదాయన్ని అందిస్తే అతి అత్యల్పంగా చెన్నై 20శాతం రాబడిని మాత్రమే అందించిందని ఆహుజా తెలిపారు. ఇక మరో సంస్థ నైట్ ఫ్రాంక్ 2024 రిపోర్టు ప్రకారం హైదరాబాద్ లో సగటు వార్షిక వృద్ధి 6శాతం నుంచి 14శాతం వరకు ఉన్నట్లు తెలిపింది.
నగరంలోని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో ఎక్కువ రియాల్టీ బూమ్ కొనసాగుతున్నట్లు ఈ రిపోర్టు పేర్కొంది. మే 2025లో కోటి అంతకంటే ఎక్కువ ధర ఉన్న ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు హైదరాబాద్ నగరంలో 37శాతం మేర పెరిగాయి. మొత్తం రిజిస్ట్రేషన్లలో 19శాతంగా ఉన్నాయి.
గత ఏడాది మేలో కోటి కంటే ఎక్కువ ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లు 14శాతమే ఉన్నాయి. 50లక్షల కంటే తక్కువ, 50లక్షల నుంచి 1కోటి మధ్య ధర ఉన్న ప్రాపర్టీలు వరుసగా 55శాతం, 26శాతం రిజిస్టర్ అయ్యాయి. మే 2025లో వెయ్యి నుంచి 2వేల చదరపు అడుగుల పరిమాణంలో ప్రాపర్టీలు 67శాతం వరకు రిజిస్ట్రేషన్ అయ్యాయి. హైదరాబాద్ నగరం కచ్చితమైన 80శాతం లాభాన్ని నిర్ధారించినప్పటికీ ఈ నగరం భారత దేశ ఆస్తి మార్కెట్లో అత్యంత నమ్మకమైనదానిలో ఒకటిగా నిలిచిందని అని చెప్పుకోవచ్చు.