Hyderabad To Kodaikanal Trip: దసరా సెలవులు ఎక్కువగానే వచ్చాయి. ఏపీ, తెలంగాణతో పాటు పాలు ప్రాంతాల్లో దసరా సెలవులు ఎక్కువగా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫ్యామిలీతో కలిసి ఎక్కడైనా హిల్ స్టేషన్ చూడాలనే కోరిక మీకు ఉందా ? అయితే హిల్ స్టేషన్ కింగ్ అయినా కొడైకెనాల్ వెళ్లి రండి. హైదరాబాద్ నుంచి సులభంగా తమిళనాడులోని పలని హిల్స్ కొడైకెనాల్ సులభంగా వెళ్లి రావచ్చు. అక్కడ అందమైన లోయలు, జలపాతాలు మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి .
1/6దసరా సెలవుల సందర్భంగా కచ్చితంగా ప్రతి ఒక్కరు ఏదో ఒక ట్రిప్ ప్లాన్ చేస్తూ ఉంటారు. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసే సమయం. పిల్లలకు కూడా స్కూళ్లకు సెలవు రావడంతో హ్యాపీగా హైదరాబాద్ నుంచి కొడైకెనాల్ ట్రిప్ వెళ్ళండి.
2/6హైదరాబాద్ నుంచి కొడైకెనాల్ కి మధురై వరకు ఫ్లైట్లో వెళ్లవచ్చు. అక్కడ నుంచి కొడైకెనాల్ 120 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి మీరు టాక్సీ లేదా బస్సు ద్వారా రెండు గంటల సమయంతో సులభంగా వెళ్లవచ్చు.
3/6ట్రైన్ ద్వారా కూడా సులభంగా వెళ్లొచ్చు. ఈ హిల్ స్టేషన్ కి అతి దగ్గరలో 80 కిలోమీటర్ల దూరంలో కొడైకెనాల్ రోడ్డు స్టేషన్ ఉంటుంది. అక్కడ నుంచి టాక్సీ, బస్ తీసుకొని నేరుగా హిల్ స్టేషన్ కి వెళ్లొచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీలోనే మీరు సుదూర ప్రాంతానికి ఈ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు.
4/6మీకు సొంతంగా కారులో వెళ్లాలనుకుంటే నేరుగా 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొడైకెనాల్ హైదరాబాద్ నుంచి ఈజీగా వెళ్లొచ్చు. దీనికి 16 గంటల సమయం పడుతుంది. NH 44 ద్వారా వెళ్లవచ్చు. ఈ దారి గుండా వెళ్తే అందమైన జలపాతాలు, దృశ్యాలు మిమ్మల్ని మరింత ఆకట్టుకుంటాయి.
5/6కొడైకెనాల్ అత్యంత ప్రాచుర్యం పొందింది కొడైకెనాల్ లేక్. ఇక్కడ సైక్లింగ్ కూడా చేయవచ్చు. 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ లేక్ అత్యంత సుందరంగా ఉంటుంది. పంట పొలాలు అందమైన పీఠభూములు మీ దృష్టిని ఆకర్షిస్తాయి. కొండలు, పొగ మంచు, పచ్చదనం మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రప్పిస్తాయి.
6/6కొడైకెనాల్ కి వెళ్తే మర్చిపోకుండా మీరు తప్పకుండా సందర్శించాల్సింది గుణా కేవ్స్. అత్యంత అరుదైన వృక్షాలు ఇక్కడ ఉంటాయి. గుహలు ఇక్కడ ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఇక్కడ ఫుడ్ కూడా ప్రత్యేకమే. దసరా సెలవుల్లో మీరు ఈ బిజీ లైఫ్ కి బ్రేక్ తీసుకోవాలంటే ఇది పర్ఫెక్ట్ ప్లేస్.