No Water Supply In Hyderabad: హైదరాబాద్ వాసులకు బిగ్ అలెర్ట్.. పలు ప్రాంతాల్లో రెండు రోజులపాటు నేటి సరఫరా బంద్ కానుంది. కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు ఫేస్ 3 పంపింగ్ సంబంధించి భారీ లీకేజీకి మరమ్మతులు చేయనున్నారు .ఈ నేపథ్యంలో రేపు, ఎల్లుండి రెండు రోజులపాటు తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుందని జలమండలి తెలిపింది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
1/5హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ప్రతిరోజూ.. మరికొన్ని ప్రాంతాల్లో రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తుంది హెచ్‌ఎండబ్ల్యూఎస్. అయితే, కొన్ని రిపెయిర్‌ల కారణంగా అప్పుడప్పుడు నీటి సరఫరా బంద్ చేస్తారు. రెండు రోజులపాటు హైదరాబాద్‌లో నీటి సరఫరా బంద్ కానుంది.
2/5హైదరాబాద్ జలమండలి అధికారులు పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని ప్రకటించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు రెండు రోజులపాటు వీటి సరఫరా బంద్ కానుంది. ఈ నేపథ్యంలో మాదాపూర్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, వనస్థలిపురం, ఉప్పల్ ,బోడుప్పల్ వంటి ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్ కానుంది.
3/5కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టుకు ఫేస్ 3 పంపింగ్ సంబంధించిన భారీ లీకేజీకి మరమ్మతులు చేయనున్న నేపథ్యంలో రేపు, ఎల్లుండి రాంపల్లి, సరూర్ నగర్, బండ్లగూడ, శంషాబాద్, నాగోల్ తదితర ప్రాంతాల్లో కూడా నీటి సరఫరా బంద్ కానుంది. సహకరించాలని ప్రజలను కోరుతున్నారు.
4/5ఈ నేపథ్యంలో రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు మరమ్మతులు చేపట్టనున్నారు. 2375 ఎంఎం డయామీటర్ పైప్ లైన్ కొండాపూర్, గోల్కొండ వద్ద రిపేయిర్ జరగనుంది. ఈ మేరకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజి బోర్డు ప్రజలకు అలర్ట్ ప్రకటించింది
5/5ఇక ఈ హెచ్ఎండబ్ల్యుఎస్ఎస్‌బీ పరిసర ప్రాంతాల్లోని వారు నీటి నిల్వ ఉంచుకోవాలని కూడా సూచించింది అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టి యథావిధిగా నీటి సరఫరా కొనసాగించనున్నారు.