Add Zee Business As A Preferred Source
App

World Cup 2025 Points Table: వరల్డ్ కప్ 2025 పాయింట్స్ టేబుల్.. భారత్ ఏ స్థానంలో ఉందంటే..?

Published: Oct 20, 2025, 09:33 AM IST|Updated: Oct 20, 2025, 09:33 AM IST

ICC Womens World Cup 2025 Points Table: మహిళల వరల్డ్ కప్‌లో టీమిండియా వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. భారత్ పరాజయాల కంటే.. ఓడిపోయిన తీరే ఎక్కువగా ఫ్యాన్స్‌ను బాధిస్తోంది. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ గెలుపు అవకాశాలు సృష్టించుకుని.. ఆఖర్లో పట్టువీడి ఓటములను కొని తెచ్చుకుంది. ఆదివారం ఇంగ్లాండ్‌పై ఒక్కొ బంతికి ఒక్కొ పరుగులు చేయాల్సిన దశలోనూ ఎక్కువగా డాట్ బాల్స్ ఆడి.. ప్రత్యర్థికి విజయాన్ని కట్టబెట్టింది. ఇక సెమీస్‌ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో తప్పకుండా నెగ్గాల్సిందే. IND vs ENG మ్యాచ్ తర్వాత ప్రపంచ కప్ 2025 పాయింట్స్ టేబుల్‌పై ఓ లుక్కేయండి. 
 

ICC Womens World Cup 2025 Points Table1/8

మహిళల ప్రపంచ కప్ 2025లో ఆస్ట్రేలియా ఎదురులేకుండా దూసుకుపోతుంది. ఆడిన 5 మ్యాచ్‌ల్లో 9 పాయింట్లు సాధించిన ఆసీస్.. సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. న్యూజిలాండ్‌పై విజయంతో తమ ఖాతాను తెరిచిన కంగారూ టీమ్.. పాకిస్థాన్, భారత్, బంగ్లాదేశ్‌లను ఓడించింది. శ్రీలంకతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.   

World Cup 2025 2/8

భారత్‌పై విజయంతో ఇంగ్లాండ్ టీమ్ కూడా సెమీస్‌కు దూసుకెళ్లింది. ఆసీస్‌ మాదిరే ఇంగ్లాండ్ ఆడిన ఐదు మ్యాచ్‌లలో తొమ్మిది పాయింట్లు సాధించింది.  

World Cup 2025 Points Table3/8

5 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లు సాధించిన సఫారీ టీమ్ కూడా సెమీస్‌లో అడుగుపెట్టింది. కొలంబోలో న్యూజిలాండ్, పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడంతో సెమీస్‌లో ప్లేస్ కన్ఫార్మ్ అయింది.  

Cricket News4/8

ఒక సెమీస్ బెర్త్ ఖాళీగా ఉండగా.. టీమిండియాపై భారీ ఒత్తిడి నెలకొంది. 4 పాయింట్లతో నాల్గో స్థానంలో ఉన్న భారత్.. మిగిలిన రెండు లీగ్ మ్యాచ్‌లలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లను కచ్చితంగా ఓడించాలి.   

ICC Womens World Cup 2025 Updates5/8

పాకిస్థాన్‌తో మ్యాచ్ రద్దవ్వడంతో న్యూజిలాండ్‌కు సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. కివీస్ ఖాతాలో నాలుగు పాయింట్లు ఉండగా.. భారత్, బంగ్లాదేశ్‌తో ఇంకా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలో గెలిస్తే సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ అవుతుంది.   

icc women's world cup 2025 points table list6/8

ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌ను ఓడించి సంచలనం సృష్టించిన బంగ్లాదేశ్.. ఆ తరువాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. భారత్, కివీస్‌తో ఇంకా మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. దాదాపు సెమీస్ దారులు మూసుకుపోయాయి.  

icc women world cup 2025 points table list7/8

వరల్డ్ కప్‌లో శ్రీలంక ఖాతాలో చేరిన పాయింట్లు అన్ని మ్యాచ్‌లు రద్దు కావడంతోనే వచ్చాయి. ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, భారత్ చేతిలో ఓడిపోగా.. రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి.  

icc women's world cup qualifier 2025 points table8/8

వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన పాకిస్థాన్.. తరువాత రెండు మ్యాచ్‌ల్లో పాయింట్లు పంచుకుంది. ప్రస్తుతం చివరిస్థానంలో ఉన్న పాక్.. సెమీస్ చేరాలంటే అద్భుతం జరగాల్సిందే.