ICICI Bank Minimum Balance: దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన ఐసిఐసిఐ బ్యాంక్ తన కస్టమర్లకు బిగ్ షాకిచ్చింది. బ్యాంక్ కనీస బ్యాలెన్స్ పరిమితిని భారీగా పెంచేసింది. ఆగస్టు 1వ తేదీ నుంచి మెట్రో నగరాల్లో కొత్తగా సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే మినిమం రూ. 50వేలు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. లేదంటే రూ. 500 పెనాల్టీ పడుతుంది. ఇతర బ్యాంకులు లిమిట్ ను తగ్గిస్తుంటే..ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రం లిమిట్ ను భారీగా పెంచేసింది.
1/6దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ షాకిచ్చింది . ఇప్పుడు పేదవారికి ఈ బ్యాంకులో ఖాతా తెరవడం కష్టం అవుతుంది. దీనికి కారణం ఈ బ్యాంక్ తన కస్టమర్లకు కనీస బ్యాలెన్స్ పరిమితిని భారీగా పెంచింది. మెట్రో నగరాల్లో నివసించే ప్రజలు తమ పొదుపు ఖాతా లో కనీసం రూ. 50,000 మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. గతంలో ఈ మొత్తం రూ. 10,000గా ఉండేది. ఆగస్టు 1, 2025 నుండి అమల్లోకి వచ్చినట్లు బ్యాంకు తెలిపింది. కొత్త ఖాతాలు తెరిచే కస్టమర్లు ఈ కొత్త నియమాన్ని పాటించాల్సి ఉంటుంది.
2/6ఐసిఐసిఐ బ్యాంక్ చిన్న పట్టణాలు, గ్రామాల్లో కనీస బ్యాలెన్స్‌ను కూడా పెంచింది. ఇప్పుడు చిన్న పట్టణాల్లోని కస్టమర్లు తమ ఖాతాలో కనీసం రూ. 25,000 ఉంచుకోవాలి. ఈ పరిమితి గతంలో రూ. 5000 ఉండేది. అదేవిధంగా గ్రామాల్లో కనీస బ్యాలెన్స్‌ను కూడా రూ. 10,000కి పెంచారు. ఇది గతంలో రూ. 2500. ఈ బ్యాంకు కనీస బ్యాలెన్స్ దేశంలోనే అత్యధికమని చెప్పవచ్చు. దేశంలోని అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2020 సంవత్సరంలో కనీస బ్యాలెన్స్ నియమాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే.
3/6అయితే చాలా బ్యాంకులు తమ కార్యకలాపాలు, పెట్టుబడులను సరిగ్గా నిర్వహించుకోవడానికి కనీస బ్యాలెన్స్‌ను తగ్గిస్తున్నాయి.కానీ ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రం కనీస పరిమితిని భారీగా పెంచేస్తూ కస్టమర్లకు చేదు వార్తను అందించింది. అకౌంట్లో కనీస బ్యాలెన్స్ రూ. 50వేలు లేనట్లయితే రూ. 500 పెనాల్టీ విధిస్తున్నట్లు తెలిపింది. కానీ ఇతర బ్యాంకులలో కనీస బ్యాలెన్స్ సాధారణంగా రూ. 2000 రూ. 10,000 మధ్య ఉంటుంది. ఉదాహరణకు దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ HDFC బ్యాంక్‌లో కనీస బ్యాలెన్స్ నగరాల్లో రూ. 10,000, చిన్న పట్టణాల్లో రూ. 5,000, గ్రామాల్లో రూ.2500గా ఉంది.
4/6ఐసిఐసిఐ బ్యాంక్ ఇప్పుడు ధనవంతులపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. ధనవంతులు తమ కస్టమర్లుగా మారాలని కోరుకుంటోంది. కనీస బ్యాలెన్స్ చాలా తక్కువగా ఉంటే.. తన కస్టమర్లలో ఎక్కువ మందికి పెద్దగా ప్రయోజనం లేదని బ్యాంక్ భావిస్తుంది. కానీ బ్యాంకు కొద్దిమందిని మాత్రమే తన కస్టమర్లుగా చేసుకుంటే.. బీమా, బ్రోకరేజ్ వంటి వాటిని అమ్మడంలో ఎక్కువ ప్రయోజనం పొందుతుందని బ్యాంకర్ తెలిపారు.
5/6ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధి బ్యాంకు కనీస బ్యాలెన్స్ అవసరాన్ని ఎందుకు ఇంతగా పెంచిందో చెప్పలేదు. దేశ జీడీపీ పెరిగేకొద్దీ ధనవంతులు, పేదల మధ్య అంతరం కూడా పెరుగుతుందని చాలా మంది నిపుణులు భావిస్తున్నారు. అందువల్ల మరిన్ని బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు ధనవంతులను తమ వైపుకు ఆకర్షించడానికి ప్రయత్నిస్తాయి. ఈ రోజుల్లో బ్యాంకులు మ్యూచువల్ ఫండ్స్ , పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్‌లతో కూడా పోటీ పడాల్సి వస్తోంది. ఎందుకంటే అవన్నీ ధనవంతులను తమ వైపుకు ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి.
6/6కాగా ఈ బ్యాంకు ప్రతి నెల మూడు క్యాష్ డిపాజిట్లను కాంప్లిమెంటరీగా ఫ్రీగా అందిస్తుంది. ఆ తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్ కు రూ. 150ఫీజు చెల్లించాల్సి వస్తుంది. అలాగే మూడు క్యాష్ విత్ డ్రాలను ఫ్రీగా అందిస్తోంది. 2025 ఏప్రిల్ లో ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లపై వడ్డీ రేటు 0.25శాతానికి తగ్గించింది. రూ. 50లక్సల లోపు బ్యాలెన్స్ ఉన్న అకౌంట్స్ కు ప్రస్తుతం 2.75శాతం వడ్డీ రేటు లభిస్తోంది.