Add Zee Business As A Preferred Source
App

White Hair Tips: పెరుగులో ఈ ఒక్కటీ కలిపితే తెల్ల జట్టు శాశ్వతంగా నిగనిగలాడే నల్ల రంగులోకి

Published: Aug 04, 2025, 03:14 PM IST|Updated: Aug 04, 2025, 03:14 PM IST

Just Add These Item In Curd For White Hair Turns Into Black: మారిన జీవనశైలి కారణంగా మూడు పదుల వయసు రాగానే జుట్టు సమస్యలు వస్తున్నాయి. జుట్టు రాలడం.. జుట్టు తెల్లబారడం జరుగుతోంది. తెల్ల జుట్టు సమస్య తీవ్రంగా వేధిస్తుంటుంది. అలాంటి తెల్ల జుట్టును చిన్న చిట్కాతో నిగనిగలాడే నలుపుగా మార్చవచ్చు. ఎలానో తెలుసుకుందాం.

1/6

తెల్ల జుట్టు సమస్యతో బాధపడేవారికి ఇంట్లో లభించే నిమ్మకాయ, పెరుగు నల్లగా మారుస్తాయి. తెల్ల జుట్టును వేర్ల నుంచి నల్లగా చేయడానికి ఇది ఒక సహజమైన పద్ధతి. తెల్ల జుట్టును నల్లగా చేయడానికి ఆయుర్వేదంలో ఈ పద్ధతిని పాటిస్తారు. 

2/6

ఓ కప్పులో పెరుగు తీసుకోవాలి. దానిలో కొంచెం తేనె కలపాలి. ఆ తర్వాత కలబంద జెల్.. లేకపోతే నిమ్మరసం కలపండి. కాఫీ పౌడర్‌ను ఆ మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ప్యాక్‌లాగా కలిపి కొద్దిసేపు పక్కన ఉంచాలి. అనంతరం జుట్టుకు ఆ ప్యాక్‌ను వేసుకోవాలి.

3/6

ప్యాక్‌ పెట్టుకున్న పది పదిహేను నిమిషాల తర్వాత జుట్టును బాగా మసాజ్ చేయండి. అనంతరం 20 నిమిషాలు అలాగే ఉంచి తర్వాత జుట్టును కడగాలి. తలస్నానం చేస్తే సరిపోతుంది. స్నానం చేసేప్పుడు జుట్టుకు షాంపూ, కండీషనర్‌ కానీ ఏవీ పెట్టరాదు. ఎందుకంటే ప్యాక్‌ చేసినా ప్రయోజనం ఉండదు.

4/6

ఈ హెయిర్‌ ప్యాక్ జుట్టు మూలాల్లోకి వెళ్లి పని చేస్తుంది. జుట్టు మూలాల్లోని రక్త ప్రసరణను ప్రేరేపించడంతోపాటు అనేక జుట్టు సమస్యలను నివారిస్తుంది. ఆ మిశ్రమం పెట్టిన అనంతరం అవి తలలోని రంధ్రాలను తెరుస్తాయి. జుట్టుకు పోషకాలను అందించడానికి పనిచేస్తాయి. 

5/6

జుట్టు జీవం లేకుండా... పొడిగా.. దెబ్బతిని ఉంటే ఆ ప్యాక్‌లో నిమ్మకాయ, పెరుగు మాత్రమే వాడితే ప్రయోజనకరంగా ఉంటుంది. పెరుగు, నిమ్మకాయ రెండూ యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ రెండూ తలపై చర్మ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడతాయి.

6/6

ఈ హెయిర్ ప్యాక్‌ను కనీసం నెలలో నాలుగుసార్లు వేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఈ సమాచారం అవగాహన కోసం కల్పించినది. వైద్యుడి సలహా తీసుకుని దీనిని వేసుకోవాలి. దీనిని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.