Add Zee Business As A Preferred Source
App

Silver Jewelry Effect On Zodiac: ఈ ఐదు రాశుల వారు వెండి ఆభరణాలు ధరిస్తే.. ధనవంతులవ్వడం ఖాయం..

Published: Sep 13, 2025, 10:43 AM IST|Updated: Sep 13, 2025, 10:43 AM IST

Silver Jewelry Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. చంద్రుడు బలహీనంగా ఉన్న రాశుల వారు వెండితో తయారుచేసిన ఆభరణాలను ధరించడం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా మానసిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

Silver Jewelry Effect On Zodiac Signs: వెండిని ధరించడం వల్ల ఏం జరుగుతుందో దాదాపు అందరికీ ఒక ప్రత్యేకమైన అవగాహన ఉంటుంది. ముఖ్యంగా కొన్ని శాస్త్రాల ప్రకారం వెండిని చంద్రుడితో పోలుస్తారు. అందుకే ఈ వెండితో తయారుచేసిన ఆభరణాలను ధరించడం వల్ల మానసిక ప్రశాంతత మెరుగుపడుతుందని జ్యోతిష్యులు చెబుతూ ఉంటారు. అందుకే చాలామంది మహిళలు ఎక్కువగా కాళ్లకు చేతులకి వెండిని ధరించేందుకు ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా పూర్వీకులు అయితే తప్పకుండా రెండు చేతులకు వెండి కడియాలను ధరించేవారు..
 

Benefits Of Wearing Silver Ring1/5

వెండి ఆభరణాలు

వెండి ఆభరణాలను ధరించడం వల్ల మనుషులు అందంగా కూడా కనిపిస్తూ ఉంటారు. ముఖ్యంగా జాతకంలో చంద్రుడు అశుభ స్థానంలో ఉన్న రాశుల వారు తప్పకుండా వెండితో తయారుచేసిన ఆభరణాలను ధరించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఐదు రాశుల వారు వెండిని ధరించడం వల్ల జీవితంలో విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. 

Benefits Of Wearing Silver Ring2/5

జాతకంలో చంద్రుడు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..కొన్ని రాశుల వారు వెండితో తయారుచేసిన ధరించడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వెండి ఆభరణాలు ధరిస్తే జాతకంలో చంద్రుడు శుభ స్థానంలో బలపడతాడు. దీనివల్ల మానసిక ప్రశాంతత విపరీతంగా పెరుగుతుంది. అలాగే అనుకున్న పనులు కూడా జరిగిపోతాయి.   

Benefits Of Wearing Silver Ring On Thumb3/5

ఆభరణాలు..

వెండితో తయారుచేసిన ఆభరణాలు ధరించడం వల్ల వృషభ, కర్కాటక రాశుల వారికి చాలా మేలు జరుగుతుంది. ముఖ్యంగా వీరికి మనస్సు ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతూ ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మానసిక సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వెండి ఆభరణాలు ధరించాల్సి ఉంటుంది.   

Astrological Jewelry4/5

చంద్రుడు జాతకంలో..

అలాగే వృశ్చిక రాశితో పాటు తుల మీనరాశుల వారికి కూడా వెండిని ధరించడం వల్ల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి పనుల్లో వస్తున్న అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే చంద్రుడు జాతకంలో బలంగా మారతాడు. దీనివల్ల మానసికంగా చాలా వరకు కలిసి వస్తుంది. అలాగే ధనవంతుడు కూడా అవుతారు.   

Silver Jewelry5/5

వెండి ఆభరణాలు..

వెండి ఆభరణాలు ధరించాలనుకునేవారు ప్రతిరోజు శరీరంపై ఉంచుకోనక్కర్లేదు.. సోమ, శుక్రవారం వెండి ఆభరణాలు పెట్టుకోవడం మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా స్త్రీలైతే ఎల్లప్పుడూ వారి ఎడమ చేతికి వెండి ఉంగరం ధరించడం, బొటన వేళ్ళకి ఉంగరాలు ధరించడం చాలా మంచిది..