Gold Rate: అయ్యయ్యో.. కొంపమునిగిపోయిందక్కో..ఆ ట్రంప్‌ దెబ్బకు స్టాక్‌ మార్కెట్‌. బంగారం, వెండికి చివరకు ఈ గతి పట్టింది

Gold Rate:  ఇది సామాన్యులకు భారీ శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే భారీగా పెరుగుతున్న బంగారం ధరలతో తులం బంగారం  కూడా కొనలేమా అంటూ దీనంగా చూసిన సామాన్యులకు ఇప్పుడు తగ్గుతున్న బంగారం ధరలు భారీ ఉపశమనం ఇచ్చినట్లేనన చెప్పవచ్చు. ఎన్ని రోజులు ఇలా తగ్గుతుందో కానీ..తగ్గినప్పుడు మాత్రం పండగే. 
 

1 /6

Gold Rate: సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు ఇది గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ధరలు తగ్గుతున్నాయి. ఎన్నో రోజులు తగ్గుతాయో తెలియదు కానీ బంగారం, వెండి ధరలు మాత్రం మరోసారి తగ్గుముఖం పట్టాయి. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. 

2 /6

దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో సోమవారం 24క్యారెట్ల బంగారం ధర రూ. 90, 380గా ఉంది. ఈ రోజు రూ. 650తగ్గింది. దీంతో 89, 730కి చేరుకుంది. గత శుక్రవారం నాటితో పోల్చితే నిన్న అంటే సోమవారం భారీగా తగ్గింది. 

3 /6

తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో బంగారం ధరలు తగ్గుతున్నాయి. సోమవారం పది గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 82,850ఉంది. మంగళవారం నాడు 82,250గా ఉంది. అంటే మొత్తం పది గ్రాములపై 600 తగ్గింది.   

4 /6

ఇలా బంగారం ధరలు పెరిగినా..వెండి ధరలు మాత్రం తగ్గుతూనే వస్తున్నాయి. మంగళవారం మార్కెట్లో కూడా వెండి ధర ఏ మాత్రం పెరగలేదు. నేటి మార్కెట్లో వెండి కిలోకు రూ. 94వేలుగా నమోదు అయ్యింది.   

5 /6

ఇప్పటివరకు బంగారం అధిక ధర కారణంగా వార్తల్లో నిలిచింది. కానీ ఇప్పుడు బంగారం ధర 10 గ్రాములకు రూ. 56000 కు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. బంగారం ధర రూ. 56000 స్థాయికి చేరుకోవచ్చని కూడా చెబుతున్నారు.  

6 /6

ఎకనామిక్స్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఈ అంచనాను అమెరికన్ మార్నింగ్‌స్టార్ విశ్లేషకులు చేశారు. రాబోయే రోజుల్లో బంగారం ధరలు 38% భారీగా తగ్గవచ్చని వారు అంచనా వేశారు. రాబోయే సంవత్సరాల్లో బంగారం ధర ఔన్సుకు $3080 నుండి ఔన్సుకు $1820కి తగ్గవచ్చని అమెరికన్ నిపుణుడు డాన్ మిల్స్ పేర్కొన్నారు. అంటే భారతదేశంలో బంగారం ధర 10 గ్రాములకు రూ. 55000-56000 వరకు చేరవచ్చు.