ఫోటోలు: సిక్కింలో తొలి విమానాశ్రయం ప్రారంభం

  • Sep 25, 2018, 17:30 PM IST
1 /7

సిక్కింలో తొలి విమానాశ్రయాన్ని భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం (సెప్టెంబర్ 24,2018) ప్రారంభించారు.

2 /7

గ్యాంగ్‌టక్‌కు 33 కిలోమీటర్ల దూరంలోని పాక్యాంగ్‌లో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దీన్ని నిర్మించింది. అత్యంక సంక్లిష్టతల మధ్య 9ఏళ్లు శ్రమించి దీన్ని నిర్మించారు.

3 /7

సుమారు రూ.605 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ విమానాశ్రయం.. 206 ఎకరాల్లో ఈ ఎయిర్‌పోర్టు విస్తరించి ఉంది.

4 /7

సముద్ర మట్టానికి 4500 అడుగుల ఎత్తులో ఈ విమానాశ్రయం ఉంది.

5 /7

అక్టోబర్‌ 4, 2018 నుంచి ఢిల్లీ, కోల్‌కతా, గౌహతిలకు ఇక్కడి నుంచి విమాన సేవలు ప్రారంభం కానున్నాయి.

6 /7

భారత్‌-చైనా సరిహద్దుకు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది.

7 /7

ఇది దేశంలో ప్రయాణికుల సేవలు అందించే 100వ విమానాశ్రయం.