Incense sticks side effects: పూజలు అనగానే అగరబత్తీలు వెలిగించడం ప్రతి ఒక్కరూ చేస్తారు. దీంతో ఆ చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా ఆధ్యాత్మికంగా మారతాయి. దీపం, ధూపం వేస్తేనే చాలామందికి పూజ చేసిన సంతృప్తి ఉంటుంది. అయితే అగరబత్తీల నుండి వచ్చే పొగని పీల్చడం.. ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు పల్మనాలజిస్టులు. వీటిని కంటిన్యూగా పీల్చడం వల్ల సిగరెట్ కంటే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు.
1/5పూజలు చేసేటప్పుడు అగరబత్తీలు వెలిగించడం చాలామందికి అలవాటు. ఇవి గదిలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని తెస్తాయి. అయితే, అగరబత్తీల పొగ ఆరోగ్యానికి హాని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.
2/5అగరబత్తీల పొగలో PM 2.5 కణాలు, కార్బన్ మోనాక్సైడ్, హానికరమైన వాయువులు ఉంటాయి. ఇవి ఇంటి గాలిని కలుషితం చేస్తాయి. ఈ పొగను ఎక్కువగా పీల్చడం వల్ల శ్వాసకోశ సమస్యలు, దగ్గు, అలర్జీలు వస్తాయి. చిన్న పిల్లలు, వృద్ధులపై ఈ పొగ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
3/5రోజూ మూసిన గదిలో అగరబత్తీలు వెలిగించడం వల్ల బ్రోన్కైటిస్, ఆస్తమా, COPD వంటి వ్యాధులు రావచ్చు. కొన్ని సందర్భాల్లో లంగ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.
4/5అగరబత్తీల పొగ సిగరెట్ పొగతో సమానమైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి, ఈ పొగను ఎక్కువగా పీల్చకుండా జాగ్రత్త పడాలి. పూజల సమయంలో అగరబత్తీలు వాడాలనుకుంటే, అప్పుడప్పుడు మాత్రమే వెలిగించాలి.
5/5గదిలో కిటికీలు తెరిచి, పొగ బయటికి వెళ్లేలా ఫ్యాన్ ఆన్ చేయాలి. మంచి సుగంధం కోసం ఆయిల్ డిఫ్యూజర్స్ లేదా కెమికల్ లేని సహజమైన అగరబత్తీలు వాడడం మంచిది. ఇలా చేస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.