Add Zee Business As A Preferred Source
App

Gold Rate: ఒక్కటైన భారత్-చైనా.. తులం బంగారం ధర ఏకంగా రూ. 20వేలకు పడిపోయే ఛాన్స్.. ఇంతకంటే మంచి వార్త ఉంటుందా?

Written ByBhoomi
Published: Sep 02, 2025, 10:35 AM IST|Updated: Sep 02, 2025, 10:35 AM IST

Gold Rate:  అంతర్జాతీయంగా చాలా ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి. చైనా, రష్యా, భారత్ ఒక్కటయ్యాయి. చైనాతో భారత్ దోస్తీ పలు ఆసక్తికర చర్చలకు దారితీస్తోంది. అయితే దేశీయంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో డ్రాగన్ కంట్రీ తీసుకునే ఒక నిర్ణయం వల్ల పసిడి ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 
 

Gold Rate1/7

దేశీయంగా బంగారం ధరలు

దేశీయంగా బంగారం ధరలు ఊహించని స్థాయికి చేరుకున్నాయి. సామాన్యులు కొనుగోలు చేయలేనంతగా భారీగా పెరిగిపోతున్నాయి.  ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1.07 లక్షలు దాటేసింది. ఇది చరిత్రలోనే అతిపెద్ద రికార్డు అని చెప్పవచ్చు. 

Gold Rate2/7

సాధారణ కుటుంబాలకు పసిడి ఆభరణాలు

పెరుగుతున్న ధరల కారణంగా సాధారణ కుటుంబాలకు పసిడి ఆభరణాలు కొనుగోలు చేయడం దాదాపు అసాధ్యమైందని చెప్పవచ్చు. మధ్యతరగతి ప్రజలు ముఖ్యంగా పెళ్లిళ్లు, వేడుకల సందర్భాల్లో బంగారం కొనే విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. ఆభరణాల దుకాణాలు కూడా ఖాళీగా మారిపోతున్నాయి.  

Gold Rate3/7

అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి

బంగారం ధరలు ఇలా విపరీతంగా పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి అని చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతుండగా, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సేఫ్ ఆప్షన్‌గా బంగారంలోకి మార్చేస్తున్నారు. దీంతో బంగారానికి డిమాండ్ పెరిగి, ధరలు ఎగబాకుతున్నాయి.

Gold Rate4/7

సెంట్రల్ బ్యాంకులు కూడా భారీగా బంగారం

అదనంగా, పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా భారీగా బంగారం నిల్వలను కొనుగోలు చేస్తున్నాయి. ఇందులో చైనా అగ్రస్థానంలో ఉంది. చైనా తన రిజర్వులను బలోపేతం చేసుకోవడం కోసం భారీ స్థాయిలో బంగారం కొనుగోలు చేయగా, భారత్ సహా మరికొన్ని దేశాలు కూడా అదే దారిలో నడుస్తున్నాయి. ఈ చర్యలు కూడా ధరల పెరుగుదలకు దోహదం చేశాయి.

Gold Rate5/7

బంగారం ధరల ఈ ఎగబాకుడు

అయితే, నిపుణుల అంచనా ప్రకారం, బంగారం ధరల ఈ ఎగబాకుడు ఎక్కువ కాలం నిలవకపోవచ్చని చెబుతున్నారు . ఎందుకంటే  చైనా తన వద్ద ఉన్న అపారమైన బంగారం నిల్వలను మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

Gold Rate6/7

అమెరికాతో జరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తత

 అమెరికాతో జరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలకు ప్రతిస్పందనగా చైనా ఈ వ్యూహాన్ని అవలంబించినట్లయితే , గ్లోబల్ మార్కెట్లో బంగారం సరఫరా ఒక్కసారిగా భారీగా పెరిగిపోతుందని చెబుతున్నారు. దీంతో ధరల భారీగా తగ్గే ఛాన్స్ ఉంటుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

Gold Rate7/7

ఒక్క తులం బంగారం

ప్రస్తుతం ఒక్క తులం బంగారం ధర గరిష్ట స్థాయిలో ఉండగా, చైనా ఈ నిర్ణయం తీసుకుంటే కనీసం రూ.20,000 వరకు తగ్గే అవకాశం ఉందని కూడా మార్కెట్  నిపుణులు చెబుతున్నారు. అందువల్ల, బంగారం కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నవారు వచ్చే రోజుల్లో ధరల మార్పుపై మరింత జాగ్రత్తగా ఉండాలని ఆర్థిక విశ్లేషకులు సూచిస్తున్నారు.