Add Zee Business As A Preferred Source
App

Suspension Of Services: అగ్రరాజ్యానికి భారత్ అదిరిపోయే షాక్.. ఆగస్టు 25 నుండి ఆ సర్వీస్ బంద్..!

Written ByAruna MaharajuUpdated byAruna Maharaju
Published: Aug 23, 2025, 05:49 PM IST|Updated: Aug 23, 2025, 05:49 PM IST

Suspension Of All Postal Services: ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత్ పై 25 శాతం సుంకాన్ని విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు అదనంగా 25 శాతం జరిమానా విధించారు. అయితే ఇప్పుడు ట్రంప్ కు కూడా భారత్ మంచి రిటర్న్ గిఫ్ట్ తో అదిరిపోయే షాకిచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
 

donald trump postal services1/5

అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే కారణంతో అమెరికా భారత్‌పై సుంకాలు విధించింది. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని స్పష్టం చేసింది.   

us president trump2/5

తాజాగా అమెరికాకు పోస్టల్ సేవలను నిలిపివేస్తూ భారత్ మరో ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 25 నుంచి అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు తపాలా శాఖ ప్రకటించింది. అమెరికా జారీ చేసిన కొత్త కస్టమ్స్ నిబంధనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.  

donald trump3/5

ఈ నిబంధనల ప్రకారం 800 డాలర్ల వరకు విలువైన వస్తువులకు ఇచ్చిన సుంకం రహిత మినహాయింపును రద్దు చేశారు. దీంతో అమెరికాకు వెళ్లే అన్ని పోస్టల్ వస్తువులపై కొత్త సుంకాలు విధించనున్నారు.   

Postal Services 4/5

అయితే 100 డాలర్ల వరకు విలువైన లేఖలు, పత్రాలు, బహుమతి వస్తువులకు మాత్రం మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఈ కొత్త నియమాల వల్ల అమెరికాకు సరుకులు పంపే విమానయాన సంస్థలు ఆగస్టు 25 తర్వాత బుకింగ్‌లను స్వీకరించలేమని తెలిపాయి.   

Postal Services to the U.S. Suspended5/5

ఇప్పటికే బుక్ చేసిన కానీ డెలివరీ కాని వస్తువులకు కస్టమర్లు పోస్టేజ్ రీఫండ్ కోరవచ్చని శాఖ తెలిపింది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, సేవలను త్వరగా సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కూడా వెల్లడించింది.