Indian Army Jobs: NCC సర్టిఫికేట్ ఉన్న అభ్యర్థులకు ఇండియన్ ఆర్మీ శుభవార్త చెప్పింది. దేశ రక్షణ దళంలో భాగం అయ్యే అవకాశాన్ని కల్పించనుంది. ఈ మేరకు షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో స్పెషల్ ఎంట్రీ ద్వారా.. అర్హులైన వారికి ఉద్యోగావకాశాలను కలిపించనుంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేసింది.
1/5ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే NCC సర్టిఫికేట్ ఉన్నవారికి గుడ్‌న్యూస్. దేశ రక్షణ దళంలో భాగమయ్యే అద్భుత అవకాశం మీకు కల్పిస్తున్నారు. షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రత్యేక ఎంట్రీతో 70 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ అవకాశం అవివాహిత పురుషులకు మాత్రమే. ఆసక్తి ఉన్నవారు www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
2/5అభ్యర్థులు డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేయవచ్చు. ఎన్‌సీసీ సీనియర్ డివిజన్‌లో మూడు సంవత్సరాలు పనిచేసి, ఎన్‌సీసీ ‘సి’ సర్టిఫికేట్‌లో కనీసం బీ గ్రేడ్ పొంది ఉండాలి. వయసు 19 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే, జనవరి 2, 2001 నుంచి జనవరి 1, 2007 మధ్య జన్మించినవారు అర్హులు.
3/5శారీరక దృఢత్వం కోసం 2.4 కిలోమీటర్ల పరుగును 10 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేయాలి. అలాగే 30 పుష్‌అప్‌లు, 40 పుల్‌అప్‌లు, 6 సిట్‌అప్‌లు తప్పనిసరిగా చేయాలి. ఎంపిక ప్రక్రియలో డిగ్రీ, ఎన్‌సీసీ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
4/5ఎన్‌సీసీలో ఏ గ్రేడ్ ఉంటే 50 బోనస్ మార్కులు, బీ గ్రేడ్ ఉంటే 25 బోనస్ మార్కులు ఇస్తారు. డిగ్రీ మార్కులకు కూడా 50 బోనస్ మార్కులు కేటాయిస్తారు. ఈ మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
5/5ఎంపికైన వారికి చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీలో 49 వారాల శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో నెలకు 56,100 రూపాయల స్టైపెండ్ ఇస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత మద్రాస్ యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీ ఇస్తారు. ఆ తర్వాత లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.