Add Zee Business As A Preferred Source
App

Jobs: నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. డిగ్రీ అర్హతతో ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. చివరి తేది ఎప్పుడంటే..!

Written ByAruna Maharaju
Published: Sep 26, 2025, 02:31 PM IST|Updated: Sep 26, 2025, 02:31 PM IST

Indian Bank Recruitment 2025: డిగ్రీ పూర్తి చేసి ఏ ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నారా..? అయితే ఈ అద్భుత అవకాశం మీ కోసమే. ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. 
 

Indian Bank Recruitment 20251/5

ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్. ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేయవచ్చు. మొత్తం పోస్టులు సంఖ్య 171(స్పెషలిస్ట్ ఆఫీసర్) ఉన్నాయి. 

Indian Bank Recruitment  2/5

డిగ్రీ అర్హతతో ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

అర్హతలు ఇలా ఉన్నాయి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ, బి.టెక్/ బీఈ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, CA, ఎంఎస్సీ, ఎంబీఏ/ పీజీడీఎం, ఎంసీఏ, ఎంఎస్, ఐసీఎస్ఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.  

Indian Bank  3/5

ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

వయసు 23 నుంచి 36 ఏళ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఇప్పటికే సెప్టెంబర్ 23న అప్లికేషన్లు ప్రారంభం కాగా.. చివరి తేది అక్టోబర్ 13 వరకు ఉంది. 

Indian Bank Notification 20254/5

డిగ్రీ అర్హతతో ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు ఫీజు లేదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, అభ్యర్థులకు రూ.1000 ఫీజు ఉంది. షార్ట్ లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  

Indian Bank Jobs5/5

నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్

అభ్యర్థులు పూర్తి వివరాలకు indianbank.bank.in వెబ్‌సైట్‌‌ని సందర్శించండి. నిరుద్యోగులు వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.