Indian Culture: భారతదేశంలో బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాకుండా శుభప్రదం, సంప్రదాయం, పెట్టుబడి ప్రతీకగా భాస్తుంటారు. వివాహాలు, పండుగలు బంగారం లేకుండా పూర్తికావు. ప్రస్తుతం భారతీయ కుటుంబాల వద్ద దాదాపు 25,000 టన్నుల బంగారం ఉందని అంచనా. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నిల్వ అని చెబుతున్నారు. చైనా తర్వాత భారత్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారం వినియోగదారుగా ఉంది. ద్రవ్యోల్బణం, ఆర్థిక అనిశ్చితి మధ్య బంగారం భద్రమైన పెట్టుబడిగా నిలుస్తోంది.
1/7భారతదేశంలో బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది సంప్రదాయానికి, శుభప్రదతకు, అలాగే పెట్టుబడికి ప్రతీకగా భావిస్తుంటారు. వివాహాలు, పండుగలు, శుభకార్యాలు బంగారం లేకుండా ఊహించుకోలేరు. కొత్త వధూవరుల కోసం ఆభరణాలు తప్పనిసరిగా కొనుగోలు చేస్తుంటారు. అలాగే పుట్టినరోజులు, ప్రత్యేక సందర్భాలలో బంగారు ఆభరణాలను బహుమతిగా ఇవ్వడం భారతీయ సంస్కృతిలో భాగమైపోయింది.
2/7బంగారం పట్ల ఉన్న ఈ ఆకర్షణను గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఒక అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషకుడి నివేదిక ప్రకారం, భారతీయ కుటుంబాల వద్ద దాదాపు 25,000 టన్నుల బంగారం ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు నిల్వలలో ఒకటిగా పరిగణిస్తున్నారు.
3/7అమెరికా, జర్మనీ, చైనా వంటి దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న నిల్వలు కూడా భారతీయుల వ్యక్తిగత బంగారం ముందు చిన్నవే. కేవలం ఒక సంవత్సరంలోనే భారతదేశ సంపద బంగారం ద్వారా 750 బిలియన్ అమెరికన్ డాలర్ల మేర పెరిగిందని అంచనా వేశారు.
4/7భారతదేశం చైనా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారం వినియోగదారుగా ఉంది. ఇది కేవలం పెట్టుబడిగా కాకుండా ఆర్థిక భద్రతకు చిహ్నంగా కూడా భావించబడుతుంది.
5/7ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువల్లో మార్పులు, ఆర్థిక అనిశ్చితి , ఇవన్నీ మధ్య బంగారం ఎప్పటికీ భద్రమైన ఆస్తిగా భావిస్తుంటారు. అనేక గ్రామీణ కుటుంబాలు తమ అవసరాలు తీర్చుకోవడానికి బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెడతాయి.
6/7బంగారం డిమాండ్ ముఖ్యంగా వివాహ కాలంలో, దీపావళి, అక్షయ తృతీయ, దసరా వంటి పండుగల సమయంలో భారీగా పెరుగుతుంది. నగరాల కంటే గ్రామాల్లో ఈ క్రేజ్ మరింత ఎక్కువగా కనిపిస్తుంది. సాధారణ మధ్యతరగతి కుటుంబాలు కూడా తమ భవిష్యత్తు భద్రత కోసం చిన్న చిన్న పరిమాణాల్లో అయినా బంగారం కొనుగోలు చేస్తుంటాయి.
7/7బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం కాదు, అది తరతరాలుగా నిలిచే సంపద. మనవలకూ అందించగలిగే స్థిరాస్తి లాంటిది. అందుకే ఇది పెట్టుబడిగా, సంప్రదాయ వారసత్వంగా సమానంగా విలువ పొందుతోంది.