Team India: మొదటిసారి వన్డే ప్రపంచకప్‌ను సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు గురువారం రాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ క్రమంలో రాష్ట్రపతికి భారత జట్టు ప్లేయర్లు సంతకం చేసిన జెర్సీని అందించారు. అలాగే ప్రపంచ కప్ ట్రోఫీని కూడా రాష్ట్రపతికి అందజేశారు.
వరల్డ్ కప్ సాధించిన టీమిండియా ఉమెన్స్ క్రికెట్ టీమ్.. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భారత మహిళా క్రికెట్ జట్టును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు.
ప్రపంచకప్ సాధించి చరిత్ర సృష్టించారని, యువతరానికి ఆదర్శంగా నిలిచారంటూ వారిని.. రాష్ట్రపతి ప్రశంసించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాసేపు సరదాగా మహిళా క్రికెటర్లతో గడిపారు. అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఇలానే అన్నింటిలో విజయాలు సాధించాలని ద్రౌపది ముర్ము ఆకాక్షించారు.
నవంబర్ 2న నవీ ముంబై వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్లు మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో తలపడ్డాయి.
ఈ మ్యాచ్‌లో 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను భారత్ ఓడించింది. తద్వారా తొలిసారి మహిళల వన్డే ప్రపంచకప్‌ను భారత్ ముద్దాడింది.