Richest Heroine: మన దేశంలో రిచెస్ట్ హీరోయిన్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది దీపికా పదుకొణే, ప్రియాంక చోప్రా,ఐశ్వర్య రాయ్, ఆలియా భట్ పేర్లు ముందు వరసలో ఉంటాయి. కానీ వీళ్లందరి కంటే ఆస్తుల్లో తోపు ఈ శాండిల్ వుడ్ భామదే. ఈమె ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
1/6Richest Heroine in India Radhika kumarswamy: శాండల్‌వుడ్ స్టార్ హీరోయిన్ రాధిక కుమారస్వామి మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ గా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఈమె స్వస్థలం కర్ణాటకలోని మంగళూరు. వీళ్లది తుళు మాట్లాడే ఫ్యామిలీ. అంతేకాదు ఈమె అనేక కన్నడ చిత్రాలలో నటించి ప్రేక్షకులకు ఆరాధ్య కథానాయికగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
2/6అంతేకాదు రాధిక కుమారస్వామి అసలు పేరు రాధిక పూజారి. ఈమె 2002లో ‘నీల మేఘ శ్యామ’ అనే కన్నడ చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఇక విజయ్ రాఘవేంద్ర హీరోగా నటించిన ‘నినగాగి’తో హీరోయిన్ గా వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అంతేకాదు సినిమాల్లో యాక్ట్ చేయకముందే రతన్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్నేళ్లకే అతనితో తెగతెంపులు చేసుకుంది.
3/6ఆ తర్వాత 2007లో అప్పటి ముఖ్యమంత్రి జేడీఎస్ అధినేత కుమారస్వామికి చేరువైంది. ఆ తర్వాత వీళ్లిద్దరు 2010లో పెళ్లి చేసుకున్నారు. 2015లో వీరిద్దరు విడివిడిగానే ఉంటున్నారు.
4/6రాధిక విషయానికొస్తే.. కేవలం నటిగానే కాదు.. నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించింది. అంతేకాదు ఈమెకు వారసత్వంగా కొన్ని వ్యాపారులున్నాయి. ఈమె ఇప్పటి వరకు 34 కి పైగా సినిమాలు చేసింది. తెలుగులో తారకరత్న హీరోగా నటించిన ‘భద్రాద్రి రాముడు’ సినిమాలో కథానాయికగా నటించింది. అటు కోడిరామకృష్ణ ‘అవతారం’ సినిమాలో నటించింది.
5/6ఈమె నవంబర్ 1 1986లో జన్మించింది. ఈమె ముఖ్యంగా తన ఫిట్‌నెస్, అందం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వాటికి సంబంధించిన వీడియోలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ ఉంటుంది. రాధిక కుమారస్వామి ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది. రాధికకు షమిక అనే కుమార్తె ఉంది. ప్రస్తుతం బిడ్డతో కలిసి మంగళూరులో నివసిస్తోంది.
6/6నటి రాధిక కుమారస్వామి మన దేశంలో అత్యంత రిచెస్ట్ హీరోయిన్ అని చెప్పాలి. ఈమె సినిమాల్లో నటించడం ద్వారా కాకుండా వ్యాపారులు.. భర్త కుమార స్వామి వల్ల పలు ఆస్తులు ఈమెకు దక్కినట్టు సమాచారం. ప్రస్తుతం రాధిక కుమారస్వామి ఆస్తులు లెక్కవేస్తే రూ. 700 కోట్లకు పైగా స్థిర, చరాస్తులున్నట్టు సమాచారం. అంతేకాదు మన దేశంలో దీపికా, ఆలియా, ప్రియాంక వంటి కథానాయకలు కూడా రాధిక ఆస్తులు ముందు దిగదుడుపే అని చెబుతున్నారు.