Soundarya Latest News: దివంగత నటి సౌందర్య పేరు ఇటీవల మళ్లీ వార్తల్లో ఎక్కువగా వినిపిస్తోంది. సౌందర్య మరణానికి నటుడు మోహన్ బాబు కారణంంటూ ఓ వ్యక్తి ఖమ్మంలో ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఈ విషయంపై సౌందర్య భర్త రఘు స్పందిస్తూ.. మోహన్ బాబుతో తమకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని.. తామంతా ఓ కుటుంబంలో కలిసి ఉంటామని స్పష్టం చేశారు. తాను మోహన్ బాబును ఎంతో గౌరవిస్తానని లేఖ విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే సౌందర్యకు సంబంధించిన ఓ పాత న్యూస్ మళ్లీ తెరపైకి వచ్చింది.
తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు నటి సౌందర్య. అద్భుతమైన నటనతో మెప్పించిన ఆమె.. ఊహించని విధంగా హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. టాలీవుడ్ స్టార్ హీరోలు అందరితోనూ సౌందర్య నటించారు.
స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో 1998లో అంతఃపురం మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో జగపతి బాబు, ప్రకాష్ రాజ్‌తో సౌందర్య పోటీ పడి అద్భుతంగా నటించారు.
ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంటర్వ్యూలో కృష్ణ వంశీకి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఈ సినిమా వల్ల మీకు, మీ భార్య రమ్యకృష్ణకి గొడవ జరిగిందట.. నిజమేనా..? అంటూ యాంకర్ ప్రశ్నించారు.
ఈ మూవీలో సౌందర్య నటన చూసి రమ్యకృష్ణ.. తనను ఎందుకు తీసుకులేదంటూ కృష్ణవంశీని ప్రశ్నించారని అప్పట్లో రూమర్లు వచ్చాయి. ఈ విషయం నిజమేనా ఇంటర్వ్యూలో యాంకర్ లేవనెత్తారు.
అది తమ భార్యాభర్తల సమస్య.. మీకేందుకు..? అంటూ కృష్ణవంశీ సమాధానం ఇచ్చారు. ఈ సినిమా గురించి అడిగింది రమ్యకృష్ణ కాబటి.. ఈ ప్రశ్నను ఆమెనే అడగాలని అన్నారు. ఈ విషయం పక్కనబెడితే.. సౌందర్య, రమ్యకృష్ణ కలిసి సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన నరసింహా మూవీలో నటించిన విషయం తెలిసిందే.