Interval Walking Advantages: ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం అని అందరూ అంటారు. అయితే వ్యాయామం విషయానికి వస్తే..అందులో ఎక్కువ మంది ఎంచుకునేది వాకింగ్. అన్ని వయసుల వారికి సులభంగా చేయగలిగే ఈ వ్యాయామం ఇప్పుడు మరింత పాపులర్ అయ్యింది.
1/6కోవిడ్ తర్వాత చాలా మంది తమ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. జిమ్‌కి వెళ్లి కష్టమైన వ్యాయామాలు చేయడం ఇష్టం లేని వారికి వాకింగ్ సరళమైన పరిష్కారంగా మారింది. యువత నుంచి వృద్ధుల వరకు అందరూ వాకింగ్‌ను తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకుంటున్నారు.
2/6ఇటీవల సోషల్ మీడియాలో ఇంటర్వెల్ వాకింగ్ అనే కొత్త ఫిట్‌నెస్ ట్రెండ్ విపరీతంగా పాపులర్ అయింది. దీన్ని “జపనీస్ వాకింగ్” అని కూడా అంటారు. ఈ టెక్నిక్‌ను జపాన్‌లోని మట్సుమోటో నగరంలోని షిన్షు యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ హిరోషి నోస్ మరియు అసోసియేట్ ప్రొఫెసర్ షిజుయె మసుకి అభివృద్ధి చేశారు.
3/6ఇది సాధారణ వాకింగ్ లాగా కాకుండా, వేగం మారుస్తూ చేసే ఒక పద్ధతి. ముందుగా మూడు నిమిషాలు మెల్లగా నడవాలి. ఆ తర్వాత మూడు నిమిషాలు వేగంగా నడవాలి. మళ్లీ మూడు నిమిషాలు మెల్లగా నడవాలి. ఇలా అరగంట పాటు చేస్తే సరిపోతుంది.
4/6సాధారణ నడక కంటే ఇంటర్వెల్ వాకింగ్ వల్ల శరీరానికి ఎక్కువ శ్రమ అవుతుంది. దీని వలన హృదయ పనితీరు మెరుగవుతుంది, రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది, శరీరంలో కొవ్వు తగ్గుతుంది. కేవలం 30 నిమిషాల పాటు చేస్తే కూడా మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
5/6జపాన్‌లో జరిగిన పరిశోధనల ప్రకారం, ఈ విధంగా నడిచే వారిలో గుండెపోటు రిస్క్ 40 శాతం వరకు తగ్గింది. అదేవిధంగా, చాలా మందిలో బీపీ నియంత్రణలోకి వచ్చింది, మానసిక ఒత్తిడి తగ్గింది. ప్రారంభంలో కాస్త కష్టంగా అనిపించినా, కొద్దిరోజుల్లో అలవాటైపోతుంది.
6/6రోజు రోజుకి బిజీ జీవితంలో జిమ్‌కి వెళ్లడం కష్టమైతే, ఈ ఇంటర్వెల్ వాకింగ్ సరైన ప్రత్యామ్నాయం. ఇంట్లో దగ్గర్లోనే చేసే ఈ సులభమైన వ్యాయామం ఆరోగ్యాన్ని కాపాడడమే కాదు, మనసుకి ప్రశాంతతనూ ఇస్తుంది. కాబట్టి రోజుకు అరగంట సమయం కేటాయించి ఇంటర్వెల్ వాకింగ్ ప్రారంభించండి ..ఆరోగ్యంగా జీవించండి..