Add Zee Business As A Preferred Source
App

IPL 2025: ఐపీఎల్‌లో ఏ కెప్టెన్‌కు ఎంత జీతమో తెలుసా..! జాక్‌పాట్ కొట్టిన ప్లేయర్లు వీళ్లే..

Published: Mar 19, 2025, 04:58 PM IST|Updated: Mar 19, 2025, 04:58 PM IST

IPL 2025 ALL Captains Salary: కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య పోరుతో ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. మొత్తం 10 జట్లలో తొమ్మిది జట్లకు భారతీయ ఆటగాళ్లు నాయకత్వం వహిస్తుండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మాత్రమే విదేశీ ప్లేయర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే 10 మంది కెప్టెన్లలో ఎవరు ఎక్కువ జీతం అందుకుంటారు..? వేలంలో ఎవరికి ఎంత దక్కింది..?
 

IPL 20251/10

గత సీజన్‌ వరకు ఢిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహించిన రిషభ్ పంత్.. ఈసారి లక్నో సూపర్ జెయింట్స్‌ తరఫున బరిలోకి దిగనున్నాడు. వేలంలో రూ.27 కోట్లు వెచ్చించి లక్నో కొనుగోలు చేసింది. పంత్ నాయకత్వంలో లక్నో టీమ్ సరికొత్తగా బరిలోకి దిగనుంది.   

IPL 2025 Updates2/10

అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శ్రేయాస్ అయ్యర్.. ఈ సీజన్‌ నుంచి పంజాబ్ కింగ్స్‌ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. గత సీజన్‌లో కోల్‌కతాను ఛాంపియన్‌గా నిలబెట్టినా.. ఆ టీమ్ అయ్యర్‌ను రిటైన్ చేసుకోలేదు. వేలంలో పంజాబ్ రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది. పంజాబ్ కింగ్స్‌ను తొలిసారి విజేతగా నిలపాలని పట్టుదలతో ఉన్నాడు.  

IPL 2025 Latest Updates3/10

ఎంఎస్‌ ధోనీ నుంచి చెన్నై టీమ్ నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన రుతురాజ్ గైక్వాడ్‌.. గత సీజన్‌లో ఐదోస్థానంలో నిలిపాడు. రూ.18 కోట్లకు చెన్నై రిటైన్ చేసుకుంది.   

IPL 2025 News4/10

ఆసీస్‌కు వరల్డ్ కప్ అందించిన పాట్ కమిన్స్ నాయకత్వంలోనే మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ బరిలోకి దిగుతోంది. గత సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ను కమిన్స్ ఫైనల్‌కు చేర్చాడు. రూ.18 కోట్లకు  సన్‌రైజర్స్ రిటైన్ చేసుకుంది.  

IPL 2025 ALL Captains Salary5/10

రాజస్థాన్‌ రాయల్స్‌కు మరో ట్రోఫీ అందివ్వాలని కెప్టెన్ సంజూ శాంసన్ పట్టుదలతో ఉన్నాడు. చాలాకాలంగా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 2022 సీజన్‌లో టీమ్‌ను ఫైనల్‌కు చేర్చాడు. రూ.18 కోట్లుకు సంజూ శాంసన్‌ను రిటైన్ చేసుకుంది.

IPL6/10

స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కు కెప్టెన్‌గా ఎంపికైయ్యాడు. కేఎల్ రాహుల్ కెప్టెన్సీని నిరాకరించడంతో అక్షర్ పటేల్‌కు నాయకత్వ బాధ్యతలు దక్కాయి. రూ.16.50 కోట్లకు ఢిల్లీ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది.  

Hardik Pandya Shubman Gill7/10

హార్థిక్ పాండ్యా వెళ్లిపోయిన తరువాత గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. రూ.16.50 కోట్లకు గుజరాత్ అట్టిపెట్టుకుంది.   

IPL 2025 ALL captains8/10

గత సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ టీమ్‌కు తిరిగి వచ్చిన హార్థిక్ పాండ్యాకు రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు దక్కించుకున్నాడు. ఈసారి ఫ్రాంచైజీ రూ.16.35 కోట్లకు పాండ్యాను రిటైన్ చేసుకుంది.   

How Much Salary get all teams captains9/10

కోల్‌కతా నైట్‌ రైడర్స్ టీమ్‌ కెప్టెన్సీ బాధ్యతలు ఈసారి ఊహించని విధంగా అజింక్య రహానేకు దక్కాయి. వేలంలో రూ.1.50 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా.. కెప్టెన్‌గా నియమించింది. రహానే నాయకత్వంలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా కోల్‌కతా టీమ్ బరిలోకి దిగుతోంది.   

IPL captains10/10

రాయల్ ఛాలెంజర్స్‌ టీమ్‌కు రజత్ పాటిదార్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కొత్త కెప్టెన్‌ నాయకత్వంలో అయినా ఆర్‌సీబీ కప్ అందుకోవాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. రూ.11 కోట్లకు ఆర్‌సీబీ రిటైన్ చేసుకుంది.