IPL 2025 Open Ceremony: అత్యంత వైభవంగా ఐపీఎల్ 2025 ఓపెనింగ్, తొలి మ్యాచ్ ప్రారంభం

IPL 2025 Open Ceremony: క్రికెట్ అభిమానుల ఫీవర్ మొదలైపోయింది. ఐపీఎల్ 2025 సీజన్ 18 అట్టహాసంగా ప్రారంభమైంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా సెలెబ్రిటీల సందడితో కార్యక్రమంగా గ్రాండ్ సక్సెస్ అయింది. వర్షం అడ్డంకి తాత్కాలికంగా తొలగడంతో మ్యాచ్ కూడా ప్రారంభమైంది. 

IPL 2025 Open Ceremony: ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఈడెన్ గార్డెన్ వేదికగా మొదలైంది. అంతకంటే ముందు దాదాపు గంట సేపు ఐపీఎల్ ఓపెనింగ్ వేడుకలు అదిరిపోయాయి. 
 

1 /5

2 /5

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, దిశా పటాని, శ్రేయో ఘోషాల్, పంజాబీ సింగర్ కరణ్ ఔజ్లాల ప్రదర్శన ఉర్రూతలూగించారు. 

3 /5

ఆ తరువాత బాలీవుడ్ నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఈవెంట్ సందడిగా సాగింది.   

4 /5

కేకేఆర్ జట్టు యజమాని బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేయడమే కాకుండా వెల్‌కమ్ స్పీచ్‌తో అద్దరగొట్టారు

5 /5

ఐపీఎల్ 2025 సీజన్ 18 అత్యంత వైభవంగా ప్రారంభమైంది. రంగురంగుల లైట్లు, లేజర్ షోలు, ఫైర్ వర్క్స్, అభిమానుల కేరింతలు, సెలెబ్రిటీల ప్రదర్శనలతో అద్భుతంగా సాగింది.