SRH Released Players List: స్టార్‌ ప్లేయర్లను సాగనంపిన కావ్య పాప.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫుల్ టీమ్ ఇదే..!

Sunrisers Hyderabad Retention List: ఐపీఎల్ 2026 సీజన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ సిద్ధమైంది. ఈ సీజన్‌లో టీమ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో కొంతమంది ప్లేయర్లను మేనేజ్‌మెంట్ రిలీజ్ చేసింది. స్టార్ బౌలర్‌ మహ్మద్ షమీని లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడ్ చేసుకున్న విషయం తెలిసిందే. టీమ్‌లో ఎవరు ఉన్నారు..? ఎవరిని విడుదల చేసింది..? పూర్తి వివరాలు ఇలా.. 
 

1 /6

ఐపీఎల్ 2026 సీజన్‌కు సన్‌రైజర్స్ టీమ్‌ను ప్రకటించింది. పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని హైదరాబాద్.. స్టార్ ప్లేయర్లను మరోసారి రిటైన్ చేసుకుంది. హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్‌లను కూడా రిలీజ్ చేయనున్నట్లు ప్రచారం జరగ్గా.. ఈ రూమర్లకు పుల్‌స్టాప్ పెట్టింది.   

2 /6

సన్‌రైజర్స్ బ్యాటింగ్‌కు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మరోసారి కీలకం కానున్నారు. ఈ సీజన్‌లో ట్రావిస్ హెడ్ 13 మ్యాచ్‌ల్లో 162.61 స్ట్రైక్ రేట్‌తో 374 పరుగులు చేయగా.. అభిషేక్ శర్మ 14 మ్యాచ్‌ల్లో 33.77 సగటు, 193.39 స్ట్రైక్ రేట్‌తో 439 రన్స్ చేశాడు.  

3 /6

మహ్మద్ షమీని రిలీజ్ చేసి సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో రూ.10 కోట్లు మిగిలించుకుంది. షమి ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు. ఎకానమీ కూడా 11.23 బాగా ఎక్కువగానే ఉంది. అయితే అంతే ధర చెల్లించి షమీని గుజరాత్ టైటాన్ ట్రేడ్ చేసుకుంది.  

4 /6

స్టార్ స్పిన్నర్లు ఆడమ్ జంపా, రాహుల్ చాహర్‌లను హైదరాబాద్ విడుదల చేసింది. వీరితోపాటు వియాన్ ముల్డర్, అభినవ్ మనోహర్, అథర్వ టైడే, సచిన్ బేబీ, సిమర్‌జీత్ సింగ్‌లను కూడా రిలీజ్ చేసింది.   

5 /6

సన్‌రైజర్స్‌ పర్స్‌లో మొత్తం రూ.25.5 కోట్లు మిగిలాయి. డిసెంబర్‌లో జరగనున్న మినీ వేలంలో ఎవరిని దక్కించుకుంటుందో చూడాలి. మొత్తానికి మినీ వేలానికి ముందు కావ్య మారన్ మాస్టర్‌ స్కెచ్‌తో రిటెన్షన్‌ జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది.   

6 /6

సన్‌రైజర్స్‌ హైదరాబాద్ టీమ్: పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్, అనికేత్ వర్మ, ఆర్.స్మరన్, హర్ష్ దూబే, కమిందు మెండిస్, బ్రైడన్ కార్సే, జయదేవ్ ఉనద్కత్, జిషాన్ అన్ద్కత్, జిషాన్ మలింగస్.