Add Zee Business As A Preferred Source
App

Sanju Samson: మినీ వేలానికి ముందు బిగ్ ట్విస్ట్.. సంజూ శాంసన్ ఆ టీమ్‌లోకి వెళ్లడం గ్యారంటీ..!

Published: Sep 08, 2025, 01:11 PM IST|Updated: Sep 08, 2025, 01:11 PM IST

IPL 2026 Mini Auction Updates: రాజస్థాన్ రాయల్స్‌ టీమ్‌ను కెప్టెన్ సంజూ శాంసన్ దాదాపు వీడడం ఖాయమైంది. టీమ్ నుంచి వెళ్లిపోయేందుకు శాంసన్ ఇప్పటికే మేనేజ్‌మెంట్‌కు రిక్వెస్ట్ పెట్టుకోగా.. ట్రేడింగ్ ద్వారా దక్కించుకునేందుకు ఇతర ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. అయితే ఏ టీమ్‌లో వెళతాడనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఐపీఎల్ మినీవేలం కంటే ముందు సంజూ శాంసన్ ఏదో ఒక టీమ్‌లో చేరిపోవడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.
 

IPL 2026 Mini Auction Updates1/7

ఈ సీజన్ ఐపీఎల్‌లో రాజస్థాన్ టీమ్ పర్ఫామెన్స్ దారుణంగా ఉంది. 14 మ్యాచ్‌ల్లో కేవలం 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో కింద నుంచి రెండోస్థానంలో నిలిచింది.   

IPL 2026 Mini Auction2/7

కెప్టెన్‌గా ఆటగాడిగా సంజూ శాంసన్ ఈ సీజన్‌లో ఆశించినస్థాయిలో రాణించలేదు. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరం కాగా.. మరికొన్ని మ్యాచ్‌ల్లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడాడు. కోచ్ రాహుల్ ద్రావిడ్‌తో విభేదాల కారణంగా సంజూ టీమ్‌ను వీడాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరిగింది.   

IPL 2026 3/7

మేనేజ్‌మెంట్ మాత్రం సంజూను టీమ్‌లోనే కొనసాగాలని కోరింది. అయితే రియాన్ పరాగ్‌ను కెప్టెన్‌గా చేయాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్న నేపథ్యంలో టీమ్‌ నుంచి వెళ్లిపోవడం బెటర్ అని సంజూ శాంసన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.  

Sanju Samson4/7

రాజస్థాన్‌ను వీడి చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరతాడని మొదట్లో గట్టిగా ప్రచారం జరిగింది. ట్రెడింగ్ కోసం చర్చలు జరిగాయని.. సంజూ శాంసన్‌కు బదులుగా రవీంద్ర జడేజాను రాజస్థాన్ కోరినట్లు సమాచారం. అయితే అందుకు సీఎస్‌కే అంగీకరించలేదని చెబుతున్నారు.  

Sanju Samson IPL5/7

మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా సంజూ శాంసన్ ట్రెడింగ్ కోసం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. సంజూ ప్లేస్‌లో అంగ్‌క్రిష్‌ రఘువంశీ, రమన్‌దీప్‌ సింగ్‌లను తమకు ఇవ్వాలని రాజస్థాన్ కోరినట్లు సమాచారం.  

Sanju Samson Latest News6/7

ఇక తాజా సంజూ శాంసన్ కోసం ముంబై ఇండియన్స్ కూడా రేసులోకి వచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఓపెనర్ కమ్ వికెట్ కీపర్ కోసం చూస్తున్న ముంబై.. ట్రెడింగ్‌లో శాంసన్‌ తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. సంజూ కోసం ముంబై గట్టిగా ప్రయత్నిస్తే.. కచ్చితంగా తీసుకుంటుందని చెబుతున్నారు.  

Sanju Samson Latest News7/7

గతేడాది మెగా వేలానికి ముందు రూ.18 కోట్లకు సంజూ శాంసన్‌ను రాజస్థాన్ రాయల్స్‌ను అట్టిపెట్టుకుంది. వచ్చే సీజన్‌కు సంజూ టీమ్‌ను వీడితే.. యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్‌లలో ఒకరు కెప్టెన్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉంది.