Mumbai Indians IPL 2026 Retention List: ఐపీఎల్ 2026 రీటెన్షన్ గడువు సమీపిస్తోంది. దీంతో రీటైన్, రిలీజ్ చేసుకోవాల్సిన క్రికెటర్ల గురించి ఫ్రాంచైజీలు కసరత్తులను ముమ్మరం చేశాయి. ఇక ఐపీఎల్ హిస్టరీలోనే టాప్ ఫ్రాంచైజీలలో ఒకటిగా నిలిచిన ముంబై ఇండియన్స్.. కొందరూ ఆటగాళ్లను విడుదల చేయడానికి లిస్ట్ రెడీ చేసింది. మరి ఆ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
ఐపీఎల్ 19వ సీజన్ మినీ వేలం కోసం ముంబై ఇండియన్స్ రెడీ అయింది. ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ని సొంతం చేసుకుంది. అయితే గత సీజన్‌లో MI ప్రదర్శన నామమాత్రంగానే ఉండటంతో.. మళ్లీ ఆ తప్పులు జరగకుండా చూసుకుంటోంది.
ముంబై కోర్ టీం బలంగానే ఉండటంతో.. కేవలం కొందరూ ప్లేయర్స్‌ని మాత్రమే రిలీజ్ చేయడానికి లిస్ట్ సిద్ధం చేసుకుంది. అంతేకాకుండా గత సీజన్‌లో గాయాల కారణంగా టీంలోకి చేరిన ఆటగాళ్లని విడుదల చేయనుంది. అయితే ముంబై ఇండియన్స్‌కి కోర్ టీం ప్రధాన బలం. కోర్ టీం లిస్టులో ముఖ్యంగా రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, ట్రెంట్ బోల్ట్ ఉన్నారు.
ముంబైకి కోర్ టీం ప్రధాన బలం అని చెప్పొచ్చు. ఆ కోర్ టీం లిస్టులో ముఖ్యంగా హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్ ఉంటారు. మరీ ముఖ్యంగా MIలో రోహిత్, బుమ్రా, హార్దిక్, రోహిత్.. ఆ జట్టులో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నారు.
రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, తిలక్ వర్మ, ర్యాన్ రికెల్టన్, బెవాన్ జాకబ్స్, విల్ జాక్స్, అశ్వని కుమార్, ట్రెంట్ బోల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, మిచెల్ శాంట్నర్, కర్ణ శర్మ వంటి ఆటగాళ్లు రిటైన్ లిస్టులో ఉండగా.. రాబిన్ మింజ్, రీస్ టోప్లీ, రాజ్ బవా, సత్యనారాయణ రాజు, లిజాడ్ విలియమ్స్, విగ్నేష్ పుథుర్, కృష్ణన్ శ్రిజిత్, దీపక్ చాహర్, అల్లాహ్ ఘజాన్ఫార్ రిలీజ్ లిస్టులో ఉన్నారు.
ఇక గత సీజన్‌లో మొదటి ఐదు మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్ పరాజయం పాలైంది. కానీ ఆ తర్వాత పుంజుకొని వరుస విజయాలు అందుకొని.. ప్లేఆఫ్స్‌కి చేరుకుంది. మొత్తంగా 14 మ్యాచ్‌లు ఆడిన ముంబై.. 8 విజయాలు అందుకొని 6 మ్యాచ్‌లలో ఓడిపోయి.. 16 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచింది.