RCB Captain: రాబోయే ఐపీఎల్ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కొత్త ఓనర్‌తో పాటు కొత్త కెప్టెన్ నాయకత్వంలో ఆడనుంది. ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ఐపీఎల్ 2026లో ఆడటం కష్టమే. ఎందుకంటే అతనికి ఇండియా A, దక్షిణాఫ్రికా A జట్ల మధ్య జరిగిన మొదటి నాలుగు రోజుల మ్యాచ్‌లో తీవ్రమైన గాయమైంది. రిపోర్టుల ప్రకారం.. పాటిదార్ కనీసం నాలుగు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు.
ఐపీఎల్ 2025 సీజన్‌లో రజత్ పాటిదార్ ఆర్‌సీబీకి చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. జట్టుకు తొలిసారిగా ఐపీఎల్ టైటిల్‌ను అందించాడు. దీంతో ఈసారి కూడా రజత్‌నే 2026 సీజన్‌కి కూడా కెప్టెన్‌గా కొనసాగించాలని ఫ్రాంచైజీ నిర్ణయించింది. కానీ ఇప్పుడు ఈ గాయం కారణంగా రజత్ ఐపీఎల్‌లో ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి.
గత సంవత్సరం 31 ఏళ్ల రజత్ పాటిదార్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2025లో 312 పరుగులు చేసి.. కెప్టెన్‌గా కూడా అదరగొట్టాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌లో కూడా రజత్ ప్రభావం చూపాడు. దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ తరఫున 382 పరుగులు చేసి టోర్నమెంట్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రంజీ సీజన్ ప్రారంభంలో తన తొలి డబుల్ సెంచరీని సాధించి నేషనల్ లెవెల్‌లో మళ్లీ గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇండియా A సిరీస్‌లో రజత్ పాటిదార్ నుంచి మంచి ఇన్నింగ్స్‌లు చూస్తామనున్న టైమ్‌లో గాయం అడ్డుపడింది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో రజత్ కేవలం 19, 28 పరుగులు మాత్రమే చేసి గాయపడ్డాడు. ఈ కండరాల గాయం తీవ్రంగా ఉండటంతో రజత్‌ను నిపుణులు కనీసం 4 నెలల పాటు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. దీంతో రజత్ 2026 ప్రారంభం వరకు క్రికెట్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది.
ఆర్‌సీబీ యాజమాన్యం ఇప్పుడు కొత్త కెప్టెన్ ఎంపికపై ఆలోచనలో ఉంది. రజత్ పాటిదార్ సమయానికి ఫిట్ కాకపోతే.. జితేష్ శర్మ లేదా కృనాల్ పాండ్యా జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది. జితేష్ శర్మ గత సీజన్‌లో పటిదార్ గాయంతో దూరంగా ఉన్నప్పుడు తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు. కృనాల్ పాండ్యా కూడా ఐపీఎల్, దేశీయ టోర్నీల్లో అనుభవజ్ఞుడైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఫ్రాంచైజీ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని తాత్కాలిక కెప్టెన్‌గా నియమించవచ్చు.
ఒకవేళ రజత్ పాటిదార్ పూర్తిగా ఫిట్ అయితే.. ఐపీఎల్ 2026లో అతన్నే కెప్టెన్‌గా కొనసాగించే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు రజత్ పాటిదార్ హెల్త్ మీదనే ఆర్‌సీబీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. రజత్ లేకుంటే.. జితేష్ శర్మ లేదా కృనాల్ పాండ్యా నాయకత్వం తీసుకునే అవకాశం బలంగా ఉంది.