IPL 2026 Retention List: ఐపీఎల్ 2026 రిటెన్షన్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. టీమ్స్ మధ్య ట్రేడ్ విండో కార్యకలాపాల్లో స్పీడ్ పెరిగింది. నవంబర్ 15 సాయంత్రం 5 గంటలకు రిటెన్షన్ లిస్టు సమర్పణకు చివరి గడువు కాగా.. ఈలోపు అనేక కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఈసారి ఐపీఎల్‌లో బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్ జరిగింది. ఇప్పటివరకూ 8 మంది ఆటగాళ్ల ట్రేడ్ పూర్తయినట్లు ఐపీఎల్ వెల్లడించింది. మరి ఆ ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈసారి భారీ ట్రేడ్ డీల్ జరిగింది. CSKలోకి సంజు శాంసన్.. RRలోకి రవీంద్ర జడేజా, సామ్ కర్రన్ ట్రేడ్ పూర్తయింది. ఇందుకు సంబంధించి రెండు ఫ్రాంచైజీలు ఆయా ఆటగాళ్లను ఆహ్వానిస్తూ పోస్టులు పెట్టేశాయి. శాంసన్‌కు CSK టీం.. ‘ఫ్రమ్ గాడ్స్ ఓన్ కంట్రీ టూ లయన్స్ ఓన్ డెన్’ అంటూ పోస్ట్ పెట్టి వెల్‌కమ్ చెప్పింది. అలాగే అటు జడేజా, కరన్‌కు ఆత్మీయంగా వీడ్కోలు పలికింది. మరోవైపు రవీంద్రా జడేజాకు RR టీం స్పెషల్ పోస్టర్లు రిలీజ్ చేసి ఆహ్వానం పలికింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ నుంచి లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు మహమ్మద్ షమీ మారగా.. ముంబై ఇండియన్స్ నుండి అర్జున్ టెండూల్కర్ లఖ్‌నవూ టీంలోకి వచ్చాడు. నితీశ్ రాణా రాజస్థాన్ రాయల్స్ నుంచి దిల్లీ క్యాపిటల్స్‌కు.. డోనోవన్ ఫెరీరా దిల్లీ క్యాపిటల్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్ టీంలోకి వచ్చారు.
అలాగే ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ లక్నో సూపర్ జెయింట్స్ నుండి.. వెస్టిండీస్ పవర్ హిట్టర్ షెర్ఫెన్ రూథర్ ఫోర్డ్ గుజరాత్ టైటాన్స్ నుండి.. ఇక మయాంక్ మార్కండే కోల్‌కతా నైట్ రైడర్స్ టీం నుండి.. ఈ ముగ్గురు ముంబై ఇండియన్స్‌కి అధికారికంగా ట్రేడ్ అయ్యారు.
రవీంద్ర జడేజా రూ. 14 కోట్లకు రాజస్థాన్ రాయల్స్‌కు ట్రేడ్ కాగా.. సంజూ శాంసన్ రూ. 18 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్‌కి ట్రేడ్ అయ్యాడు. అయితే జడేజాకు చెల్లించే మొత్తం రూ. 18 కోట్ల నుంచి రూ.14 కోట్లకు తగ్గింది.
మిగతా ఆటగాళ్లయినా నితీశ్ రాణా (రూ.4.2 కోట్లు), సామ్ కరన్ (రూ.2.4 కోట్లు), మహ్మద్ షమీ (రూ.10 కోట్లు), మయాంక్ మార్కండే (రూ. 30 లక్షలు), అర్జున్ టెండూల్కర్ (రూ. 30 లక్షలు) లీగ్ ఫీజుల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే ఫెరీరాకు ఇవ్వాల్సిన మొత్తం రూ. 75 లక్షల నుంచి రూ. 1 కోటికి పెరిగింది.