IPL 2026 Mini Auction: ఈ నలుగురు ప్లేయర్లకు ముంబై ఇండియన్స్ టాటా గుడ్ బై.. లిస్ట్‌లో ఎవరు ఉన్నారంటే..?

Mumbai Indians Retention Players List: ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు జరిగే మినీ వేలానికి అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. ఈ సీజన్‌లో పెద్దగా రాణించని ప్లేయర్లను టీమ్ నుంచి రిలీజ్ చేసి.. వీలైనంత ఎక్కువ పర్స్‌తో వేలంలోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నాయి. గత సీజన్‌లో టాప్-4లో నిలిచిన ముంబై ఇండియన్స్.. ఈసారి టీమ్‌ను మరింత పటిష్టంగా మార్చుకోవాలని చూస్తోంది. మినీ వేలానికి ముందు కొంతమంది ప్లేయర్లను టీమ్‌ను పంపించేందుకు సిద్ధమవుతోంది. 
 

1 /7

ఐపీఎల్ 2025 మెగా వేలంలో దీపక్ చాహర్‌ను రూ.9.25 కోట్లకు ముంబై తీసుకుంది. అయితే చాహర్ అంచనాలను అందుకోలేకపోయాడు. 14 మ్యాచ్‌ల్లో 9.17 ఎకానమీతో 11 వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో మినీ వేలానికి ముందు దీపక్ చాహర్‌ను టీమ్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉంది.   

2 /7

దీపక్ చాహర్‌ను రిలీజ్ చేస్తే రూ.9.25 కోట్లు ముంబై పర్స్‌లో సేవ్ అవుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన దీపక్ చాహర్.. తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 95 మ్యాచ్‌ల్లో 8.13 ఎకానమీతో 88 వికెట్లు తీశాడు.  

3 /7

IPL 2025 సీజన్ నుంచి గాయం కారణంగా తప్పుకున్న అల్లా గజన్‌ఫర్ స్థానంలో ముజీబ్-ఉర్-రెహమాన్‌ను రూ.2 కోట్లకు ముంబై ఇండియన్స్ తీసుకుంది. ముజీబ్‌కు ఒక మ్యాచ్ ఆడే అవకాశం రాగా.. రెండు ఓవర్లలో 28 పరుగులు ఇచ్చాడు. గజన్‌ఫర్ నిలుపుకోవడం కోసం ముజీబ్‌ను ముంబై రిలీజ్ చేయవచ్చు.  

4 /7

ఐపీఎల్‌లో వివిధ జట్లకు ప్రాతినిధ్యం వహించిన ముజీబ్-ఉర్-రెహ్మాన్.. 20 మ్యాచ్‌ల్లో 8.34 ఎకానమీ రేటుతో 20 వికెట్లు పడగొట్టాడు.   

5 /7

ఇంగ్లాండ్ పేసర్ రీస్ టోప్లీని రూ.75 లక్షలకు తీసుకున్న ముంబై.. ఈసారి మినీ వేలానికి ముందు రిలీజ్ చేయడంపై ఆలోచించే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్‌తో క్వాలిఫైయర్ 2లో ఒకే ఒక మ్యాచ్ ఆడాడు టోప్లీ. ఈ మ్యాచ్‌లో మూడు ఓవర్లలో 40 పరుగులు ఇచ్చాడు.  

6 /7

టీమ్‌లో ఇప్పటికే పేసర్లు ఉండడం.. టోప్లీకి తుది జట్టులో చోటు కష్టంగా ఉండడంతో విడుదల చేసేందుకు మొగ్గు చూపవచ్చు. బౌలింగ్‌ను మరింత బలోపేతం చేయాలనుకుంటే మరో బలమైన పేసర్‌ను తీసుకోవచ్చు. ఇప్పటివరకు 6 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 5 వికెట్లు పడగొట్టాడు.   

7 /7

2025 మెగా వేలంలో రాబిన్ మింజ్‌ను రూ.65 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడే అవకాశం రాగా.. కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు. ఆశించినస్థాయిలో రాణించలేకపోవడంతో టీమ్‌ నుంచి రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.